33.2 C
Hyderabad
May 3, 2024 23: 11 PM
Slider మహబూబ్ నగర్

నిత్యావసర వస్తువుల షాపులకు వెసులుబాటు

#KollapurPolice

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.నెంబర్ 45 ప్రకారం అనుమతించిన నిత్యావసర సరుకుల దుకాణాలు,  పాల దుకాణాలు సాయంత్రం 6.00 గంటల వరకు తెరిచి ఉంచే వెసులుబాటు కల్పించామని కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి. వెంకట్ రెడ్డి తెలిపారు.

సర్కిల్  ప్రాంతాలలో మధ్యాహ్నం తర్వాత దుకాణాలు మూసివేస్తున్నారని దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు  జి.ఓ. 45లో సూచించిన దుకాణదారులంతా ఉదయం 6.00 నుండి సాయంత్రం 6.00 గంటల వరకు తెరిచి ఉంచే వెసులుబాటు కల్పించామన్నారు.

ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని, లాక్ డౌన్ లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దనే ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించిందన్నారు. వ్యాపారులు పోలీసులకు సహకరిస్తూ లాక్ డౌన్ నిబంధనలు పాటించడంతో పాటు ప్రతి షాప్ వద్ద విధిగా సామాజిక దూరం పాటించేలా చూడాలని, అధిక ధరలకు విక్రయించవద్దన్నారు.

ఎక్కడైనా అధిక ధరలకు విక్రయిస్తే సమాచారం ఇవ్వాలని, లాక్ డౌన్ పాటించాలని సర్కిల్ పరిధిలోని  ప్రజలను సిఐ బి. వెంకట్ రెడ్డి కోరారు.

Related posts

మానసిక వికలాంగుల పట్ల సమాజానికి బాధ్యత ఉంది

Satyam NEWS

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ కోఆర్డినేటర్ గా ఆదెర్ల శ్రీనివాస రెడ్డి

Satyam NEWS

అమృతం కన్నా మధురం

Satyam NEWS

Leave a Comment