27.7 C
Hyderabad
May 4, 2024 09: 35 AM
Slider ప్రత్యేకం

క్లస్టర్ కు ఎస్ఐ 30 మంది కానిస్టేబుళ్లు

#munugodupolice

మునుగోడు అసెంబ్లి  నియోజకవర్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు.  నియోజక వర్గంలో  170 గ్రామాలుండగా జనాభాను బట్టి ఒకట్రెండు గ్రామాలను ఒక క్లస్టర్‌లాగా ఏర్పాటు చేశారు.  మొత్తం 104 క్లస్టర్‌లను ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్‌కు ఒక ఎస్ఐతో పాటూ 30 మంది సిబ్బందిని నియమించారు. సమస్యాత్మక, అత్యంత సున్నిత గ్రామాల్లో రాష్ట్ర పోలీసులతో పాటూ కేంద్ర బలగాలు భద్రతా విధులు నిర్వహించనున్నాయి. వీరు రెండు బృందాలుగా విడిపోయి నిరంతరం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. వీరికి ఆయా గ్రామాల్లోని రైతు వేదికల్లో బస కల్పించాలని నిర్ణయించారు. ఆయా గ్రామాల్లో ప్రచారానికి వచ్చే వివిధ పార్టీల ముఖ్యులు, గ్రామంలో చోటు చేసుకునే ఘర్షణలు, ఇతర ఘటనలు జరిగినప్పుడు ఆ సంబంధిత క్లస్టర్‌కు చెందిన ఎస్సైతో పాటూ సిబ్బంది పర్యవేక్షించాల్సి ఉంటుంది. నియోజకవర్గానికి వెళ్లే సరిహద్దులు నాలుగు మూలల వద్ద నగదు, మద్యం నియంత్రణకు చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు.

ప్రతి చెక్‌పోస్టుకు మూడు బృందాలు నిరంతరం గస్తీ ఉండేలా ఒక్కోదానికి 12 మంది సిబ్బందిని నియమించారు. వీరికి అదనంగా ఐదుగురు కేంద్ర రిజర్వు బలగాలను సైతం నియమించారు. ఎన్నికల భద్రతా ఏర్పాట్ల నిమిత్తం ఎనిమిది కంపెనీల కేంద్ర రిజర్వు బలగాలు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు పది రోజుల క్రితమే చేరుకున్నాయి. గతంలో మండల కేంద్రాల్లో పోలీసులు బలగాలు బస చేసి ఆ మండలాల పరిధిలో ఘటనలు జరిగినప్పుడు అక్కడికి చేరుకునేవి. దీంతో ఎన్నికల సందర్భంగా చాలా ప్రాంతాల్లో గొడవలు జరిగేవి. ఇప్పుడు ఇలా కాకుండా క్లస్టర్లను ఏర్పాటు చేసి పోలీసులను క్షేత్రస్థాయిలోనే ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో పోలీసులు ఉండటంతో గొడవలు నియంత్రణలో ఉంటాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఎటుచూసిన పోలీసులే కనిపిస్తుండటం విశేషం.

Related posts

ప్రభుత్వం అండగా ఉంటుంది

Bhavani

ప్రజారోగ్య భద్రతే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం

Satyam NEWS

సురభి వాణీదేవి సేవాభావం కలిగిన వ్యక్తి

Satyam NEWS

Leave a Comment