32.2 C
Hyderabad
May 8, 2024 13: 27 PM
Slider ప్రపంచం

ఇరాన్‌లో యూనివర్సిటీ విద్యార్ధుల తిరుగుబాటు

#iranprotests

ఇరాన్‌లోని యూనివర్శిటీలో విద్యార్థులకు, భద్రతా బలగాలకు మధ్య ఆదివారం హింసాత్మక ఘర్షణలు జరిగాయి. పోలీసు కస్టడీలో మహ్సా అమినీ విద్యార్ధిని మరణించడంతో సాటి విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. మీడియా కథనాల ప్రకారం, పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ లు విద్యార్థులు నిరసన తెలిపేందుకు శనివారం వరకు సమయాన్ని నిర్ణయించారు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ అధిపతి హొస్సేన్ సలామి మాట్లాడుతూ నిరసనలు తెలపడంపై యువ ఇరానియన్లను హెచ్చరించారు. ముఖ్యంగా ఇరాన్ యువత నిరసనలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. 22 ఏళ్ల మహ్సా అమినీ సెప్టెంబర్ 16న పోలీసు కస్టడీలో మరణించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.

మహ్సా అమినీ అనే మహిళ ఇరాన్‌లో హిజాబ్ నిబంధనలకు వ్యతిరేకంగా తన నిరసనను వ్యక్తం చేసింది. మహ్సా హిజాబ్‌ను తొలగించినందుకు ఇరాన్ మోరల్ పోలీసులు కొన్ని నెలల క్రితం అరెస్టు చేశారు. పోలీసు కస్టడీలో ఆమె చిత్రహింసలకు గురయ్యారు. దీంతో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించి కోమాలోకి వెళ్లిపోయింది. దీనిపై ఇరాన్‌ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Related posts

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

Satyam NEWS

(Over The Counter) Nutrition Weight Loss Pills Koppla 3 Fas Motor Till 1 Fastest Weight Loss Pill

Bhavani

కొమురం భీం జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గా సత్తెన్న

Satyam NEWS

Leave a Comment