28.7 C
Hyderabad
May 5, 2024 08: 16 AM
Slider విజయనగరం

మూడో రోజు కొన‌సాగిన విజయనగరం పోలీసుల ఆప‌రేష‌న్ ప‌రివ‌ర్త‌న్

#vijayanagarampolice

ఆప‌రేష‌న్ ప‌రివ‌ర్త‌న్….ఈ నినాదంతో పోలీసులు ఓవ‌రంగా మార్చుకుంటున్నారు. ఈ స్లోగన్ తో గంజాయి గుట్కా,నాటు సారాకు అల‌వాటు ప‌డుతున్న యువ‌త దారి మ‌ళ్లించేందుకు గ‌డ‌చిన మూడు రోజుల నుంచీ విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీసులు.. జిల్లా వ్యాప్తంగా దాడులు కొన‌సాగిస్తున్నారు. ఈ ఆప‌రేష‌న్ ప‌రివ‌ర్త‌న్  కార్య‌క్ర‌మం సంద‌ర్బంగా తొలి రోజున  జిల్లా  పోలీస్ ప్రాంగణం బ్యారెక్స్ లో పోలీస్ స్టేషన్ల వారీగా గంజాయి,గుట్కా ల‌తో ప‌ట్టుబ‌డ్డ యువ‌త‌కు స్వ‌యంగా  ఎస్పీ దీపికా ,ఓఎస్డీ సూర్య‌చంద్ర‌రావు,ఎస్ఈబీ శ్రీదేవీరావు, విజ‌య‌న‌గ‌రం డీఎస్పీ అనిల్ లు కౌన్స‌లింగ్ ఇచ్చారు. అ మ‌రుస‌టి రోజు నుంచీ  జిల్లా వ్యాప్తంగా ఈ  ఆప‌రేష‌న్ ప‌రివ‌ర్త‌న‌ను అమ‌లు చేసే ప‌నిలో ప‌డ్డారు.

కొత్త‌గా జిల్లాకు వ‌చ్చిన‌3 హావా వెహికిల్స్ ద్వారా రెండింటిని జిల్లా కేంద్ర‌మైన విజ‌య‌న‌గ‌రంలో కాలేజీలు ఉండే ప్రాంతాల‌లో సీసీ కెమ‌రాల  ప‌ర్య‌వేక్ష‌ణతో  అనుక్ష‌ణం గ‌స్తీ కాస్తున్నారు..పోలీసులు.ఇక మూడు రోజు  ఈ ఆప‌రేష‌న్ ప‌రివ‌ర్త‌న్ నినాదంతోనే జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దీపికా ఆదేశాల‌తో అటు స్పెష‌ల్ ఎన్ పోర్స్ మెంట్ ఏఎస్పీ శ్రీదేవీ రావు సూచ‌న‌ల‌తో  అటు లా అండ్ ఆర్డ‌ర్ పోలీసులు, ఇటు ఎస్.ఈ.బీ క‌లిసి సంయుక్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల ప‌రిధిలో దాడులు నిర్వ‌హించింది.

జిల్లా వ్యాప్తంగా కిరాణా షాపులు, గోదాములు, బస్సులు, ఇతర వాహనాలు, కాంప్లెక్స్ లు, రైల్వే స్టేషనుల్లో తనిఖీలు చేపట్టి, మత్తు పదార్థాల అక్రమ రవాణను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. వివిధ కళాశాలను పోలీసు అధికారులు, సిబ్బంది సందర్శించి మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను వివరించి, వాటికి దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ తనిఖీలను ఎస్ ఈ బి అదనపు ఎస్పీ ఎన్. శ్రీదేవిరావు ఆధ్వర్యంలో విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం డిఎస్పీలు పర్యవేక్షించారు.

ఈ క్ర‌మంలోన‌ పెద మానపురం పీఎస్ పరిధిలో ఎస్ఐ మరియు సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టి, నిషేధిత గుట్కాలు తరలిస్తున్న  ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 5 ల‌క్ష‌ల 4,000 ల విలువైన గుట్కాలు, తరలించేందుకు వినియోగించిన  ఏపీ 39 టీఎం 8942 వెహిక‌ల్ ను   స్వాధీనం చేసుకున్నారు.అలాగే గ‌రివిడి,విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ పీఎస్ ప‌రిధిల‌లో కూడా పోలీసులు డ్రంక‌న్ డ్రైవ్ త‌నిఖీలు నిర్వ‌హించారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

క్రీడలలో మరింతగా మరింతగా రాణించాలి

Satyam NEWS

Free Sample _ List Of All Prescription Weight Loss Pills T5 Fat Burning Pills Reviews

Bhavani

చిన్న తిరుపతిని సందర్శించిన ఎమ్మెల్యేలు

Satyam NEWS

Leave a Comment