28.7 C
Hyderabad
April 27, 2024 06: 59 AM
Slider మహబూబ్ నగర్

విద్యార్ధినిలకు నారాయణపేట్ జిల్లా పోలీసుల అవగాహన కార్యక్రమాలు

#narayanpetpolice

విద్యార్థులు స్కూల్లో చిన్నతనం నుండే మంచి అలవాట్లు అలవర్చుకోవాలని నారాయణపేట్ జిల్లా మద్దూరు ఎస్ఐ. అరుణ్ కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన  ఆదేశాల మేరకు కృష్ణవేణి స్కూల్ లోనీ విద్యార్థినులకు, టౌన్ లోని గురుకుల స్కూల్ లోని విద్యార్థినిలకు ఎస్ఐ, షీటీమ్ వారు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విషయాల పట్ల  అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ  ఒకరినొకరు ద్వేషించుకోరాదని మంచి స్నేహితులు కలిగి ఉండాలని చెప్పారు. చదువుపై శ్రద్ధ కనబరిచి బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రతి ఒక్క విద్యార్థి  ఒక గోల్ ఏర్పాటు చేసుకొని దానికనుగుణంగా కష్టపడి బాగా చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని చెప్పారు. తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అలాగే  విద్యార్థులకు ర్యాగింగ్, విద్యార్థులకు good touch bad touch పై అవగాహన కలిగించారు. రోడ్డు భద్రత నియమాల గురించి, ట్రాఫిక్ నియమాల, మూఢ నమ్మకాలు, బాల్యవివాహాలు, సైబర్క్రైమ్, సెల్ ఫోన్ వినియోగం, క్రీడలు, సమాజం పట్ల అవగాహన, పోలీసు చట్టాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే విద్యార్థులకు ఎటువంటి ఆపద వచ్చినా డయల్ 100 కి కాల్ చేసి పోలీసువారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సత్యం న్యూస్ నెట్, నారాయణ పేట

Related posts

వైసీపీ పాలనా వైఫల్యాలపై చర్చకు వస్తావా నానీ?

Satyam NEWS

త్వరలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు

Murali Krishna

ఆశాలకు కరోనా కాలంలో 5 వేలు పారితోషికం ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment