Slider ముఖ్యంశాలు

రైతులను దగా చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

#congressflag

ధాన్యం కొనుగోలు వేసంగిలో వరి పంట వేసే విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను దగా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శనివారం నల్గొండ పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో అల్లం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్ఎస్,కేంద్రంలో బిజెపి రైతుల పట్ల నువ్వు కొట్టినట్లు చెయ్యి,నేను ఏడ్చినట్లు చేస్తా అన్న రీతిలో రెండు పార్టీలు డ్రామాలు ఆడుతూ రైతులను మోసం చేస్తున్నారని అన్నారు.

ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వాలు బాయిల్డ్ బియ్యం,రా  బియ్యం అంటూ సాకులు చెబుతున్నారని,ఇవేమీ రైతులకు సంబంధించినవి కావని,రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని,పండించిన పంటకు గిట్టుబాటు ధర ప్రభుత్వమే కల్పించాలని డిమాండ్ చేశారు. అసలు విషయాన్ని ప్రక్కకు నెట్టి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని రైతులను నిట్ట నిలువునా దోపిడికి గురి చేస్తూ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మిల్లర్లు,తెరాస ప్రభుత్వం ఒక్కటై రైతులకు నష్టం చేస్తున్నారని అల్లం ఆవేదన వ్యక్తం చేశారు. తెరాస కు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏక కాలంలో ఋణ మాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.2017 లో స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ 27 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు ఉచితంగా ఇస్తానన్న తెరాస ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు అని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. తెరాస లో ఒకరేమో వేసంగి వరి వేయవద్దని,మరొకరు వరి వేయమని, మరోసారి వడ్లు కొనమని ఇలా రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన మండి పడ్డారు. ప్రతి పక్షాలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తే అరెస్ట్ లు చేసి అక్రమ కేసులు పెట్టిన తెరాస ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ రైతుల పట్ల ప్రేమ ఉన్నట్లు మొసలి కన్నీరు కారుస్తున్న టిఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు,రైతులు, విద్యార్థులు,మేధావులు త్వరలో గద్దెదించడం ఖాయం అన్నారు. ధర్నా చౌక్ లు ఎత్తి వేసిన తెరాస ప్రభుత్వం ఇప్పుడు ధర్నాలు చేయడం సిగ్గు చేటని అన్నారు.

ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు భూక్యా మంజు నాయక్,జిల్లా ప్రధాన కార్యదర్శి రామిశెట్టి అప్పారావు,హుజూర్ నగర్ నియోజక వర్గం మైనార్టీ ప్రెసిడెంట్ షేక్ కరీం,జిల్లా యస్.టి సెల్ ప్రెసిడెంట్ నవీన్ నాయక్,మఠంపల్లి మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వంటిపులి  శ్రీనివాస్,కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి, ముస్తఫా, వీరేశ్, అంజి తదితరలు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

సీఎం కేసీఆర్ కు ఛాతిలో ఇన్‌ఫెక్షన్

Satyam NEWS

బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదు

Satyam NEWS

రక్తదానం చేసి ఒక తల్లిని కాపాడిన జర్నలిస్టు

Satyam NEWS

Leave a Comment