28.7 C
Hyderabad
May 5, 2024 08: 57 AM
Slider విజయనగరం

ప్రాణ‌వాయువు కొర‌త తీరిపోయింది: విజ‌య‌న‌గ‌రం ఎంపీ బెల్లాన‌…!

#vijayanagarammp

విజ‌య‌న‌గ‌రం  జిల్లా కేంద్రాసుప‌త్రిలో ప్రాణ‌వాయువుకు కొర‌త తీరిపోయింద‌ని ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ అన్నారు. పిఎం కేర్స్ నిధులు నుంచి సుమారు కోటి రూపాయ‌ల‌తో, జిల్లా కేంద్రాసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లో కొత్త‌గా నిర్మించిన 1000 ఎల్‌పిఎం పిఎస్ఏ ఆక్సీజ‌న్‌ ప్లాంటును, స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామితో క‌లిసి ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఎంపి బెల్లాన మాట్లాడుతూ, పిఎం కేర్స్  నుంచి అన్ని జిల్లాల్లో ఆక్సీజ‌న్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్ర‌ధాన‌మంత్రి నిధుల‌ను కేటాయించిన‌ట్లు చెప్పారు. సుమారు కోటి రూపాయ‌ల ఖ‌ర్చుతో జిల్లా కేంద్రాసుప‌త్రిలో ఏర్పాటు చేసిన ఈ ఆక్సీజ‌న్ ప్లాంటువ‌ల్ల‌, వంద పడ‌క‌లకు, మ‌రో 20 వెంటిలేట‌ర్ల‌కు ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా జ‌రుగుతుంద‌ని చెప్పారు.

ఇవి కాకుండా, అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో వినియోగించేందుకు ఆక్సీజ‌న్ సిలండ‌ర్ల‌ను కూడా అవ‌స‌రం మేర‌కు ఉంచుతున్న‌ట్లు తెలిపారు. గ‌తంలోనే  కోవిడ్ స‌మ‌యంలో కేంద్రాసుప‌త్రిలో, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ స‌హ‌కారంతో 10 కెఎల్ ఆక్సీజ‌న్ ప్లాంటును ఏర్పాటు చేసిన విష‌యాన్నిఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

జిల్లా కేంద్రాసుప‌త్రిలో ఇప్ప‌టికే మెరుగైన వ‌స‌తుల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని, త్వ‌ర‌లో పిల్ల‌ల విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తామ‌ని ఎంపి అన్నారు.ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (హౌసింగ్‌) మ‌యూర్ అశోక్‌, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ జి.నాగ‌భూష‌ణ‌రావు, కేంద్రాసుప‌త్రి సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ కె.సీతారామారాజు, ఎపిఎంహెచ్ఐడిసి ఇఇ ఎం.స‌త్య‌ప్ర‌భాక‌ర్‌, డిఇ ఎన్‌విటిఆర్ కుమార్‌, ఆసుప‌త్రి అభివృద్ది క‌మిటీ స‌భ్యులు డాక్ట‌ర్ విఎస్ ప్ర‌సాద్‌, న‌గేష్‌, కార్పొరేట‌ర్లు పిన్నింటి క‌ళావ‌తి, స‌త్య‌వ‌తి, ప్ర‌భాక‌ర్‌, ప‌లువురు డాక్ట‌ర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

రష్యా సబ్‌మెరైన్‌ ఇంజినీర్‌ విశాఖలో మృతి

Satyam NEWS

కూల్చివేత వ్యర్థాలను వేసినందుకు ఆర్ఎస్ బ్రదర్స్ కు రూ 10 వేలు ఫైన్

Satyam NEWS

రాజకీయ లబ్ది కోసం బీజేపీ యత్నం

Bhavani

Leave a Comment