35.2 C
Hyderabad
April 27, 2024 12: 07 PM
Slider ఖమ్మం

రాజకీయ లబ్ది కోసం బీజేపీ యత్నం

మణిపూర్లో జరుగుతున్న మారణ హోమానికి కారణం బిజెపియే అని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ ఆరోపించారు. బిజెపి మణిపూర్ మంటల ద్వారా రాజకీయ లబ్దిని కోరుకోవడంతో పాటు తన ఆర్థిక మిత్రులకు సంపదను కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు. సిపిఐ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మణిపూర్లో మంటలు- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం అనే అంశంపై పోటు ప్రసాద్ ప్రసంగించారు. శింగు నర్సింహారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పోటు ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి ఇక్కడి గిరిజన జాతుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని కానీ ఈ స్థాయిలో ఘర్షణలు ఎప్పుడు జరగలేదన్నారు.

మణిపూర్లో అత్యధిక శాతం ఉన్న మెయితీ తెగను ఆకట్టుకునేందుకు బిజెపి తేనెతుట్టేను కదిపిందని దాని ప్రభావమే మణిపూర్ లో మంటలని ప్రసాద్ విశ్లేషించారు. అత్యధికంగా ఉండడంతో పాటు ఆధిపత్య తెగగా ఉన్న మెయితీలను దగ్గర చేసుకునేందుకు. బిజెపి అక్కడి హైకోర్టు ద్వారా ఒక ప్రకటన చేయించిందని దాని పర్యవసానంగా మణిపూర్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. వివస్త్రలను చేసి ఊరేగింపు చేసి మాన ప్రాణాలను బలిగొంటుంటే కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రసాద్ ప్రశ్నించారు.

కేవలం 30 సెకన్లు మాత్రమే మోడీ మణిపూర్ పై స్పందించారని కానీ గతంలో మణిపూర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమి ప్రకటన విడుదల చేశారో గుర్తు తెచ్చుకుంటే మంచిదన్నారు. అల్లర్లను అణచలేనప్పుడు అధికారంలో కొనసాగే హక్కు లేదన్న మోడీ మాటలు ఇప్పుడు వర్తించవా అని ఆయన ప్రశ్నించారు. జాతుల మధ్య సంఘర్షణ ద్వారా రాజకీయ లబ్ది పొందడం ఒక ఎత్తుగడ అయితే హిందువులు కానీ కొన్ని ఆదిమ జాతులను మణిపూర్ నుండి బయటకు పంపడం ద్వారా అక్కడి ప్రకృతి సంపదను మోడీ ఆర్థిక మిత్రులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుందని ప్రసాద్ ఆరోపించారు.

ఖనిజాలకు కాణాచిగా చెప్పుకునే ఇంపాల్ లోయతో పాటు అక్కడి పర్వతశ్రేణుల్లోని సంపదను అంబానీ, అదానీలకు కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమే మణిపూర్ అల్లర్లు అన్నారు. దేశ ప్రజలు బిజెపి వైఖరిని నిశిషంగా పరిశీలించాలన్నారు. ఆర్ఎస్ఎస్ శ్రేణులు మణిపూర్లో నిరంతరం పనిచేస్తూ ఇటువంటి అల్లర్లకు కారణం అవుతున్నాయని ఆయన ఆరోపించారు. బిజెపి ఆర్ఎస్ఎస్.

ఎజెండాను అమలు చేస్తుందని రెండు దఫాలుగా గెలిచిన ఆర్ఎస్ఎస్ ఇప్పటి వరకు అసలు ఎజెండాను అమలు చేయలేదని మరోసారి అధికారం బిజెపికి దక్కితే భారతదేశ ప్రజలు మరిన్ని పాసిస్టు విధానాలను సవిచూడాల్సి వస్తుందన్నారు.

బిజెపి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సంసిద్ధులను చేయడమే లక్ష్యంగా పార్టీ యంత్రాంగం పని చేయాలని ప్రసాద్ కోరారు. ప్రజా చైతన్యమే బిజెపి తీరును ఎండగడుతుందన్నారు. ఈ సమావేశంలో ఎడ్యుకేషన్ సబ్ కమిటీ బాధ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి తదితరులు ప్రసంగించగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.

Related posts

చీమలపాడు బాధితులకు ప్రభుత్వం అండ

Satyam NEWS

బండి సంజయ్ పై ధ్వజమెత్తిన వామపక్ష నాయకులు

Satyam NEWS

మోదీని పొగడ్తలతో ముంచెత్తిన టోనీ అబాట్

Satyam NEWS

Leave a Comment