36.2 C
Hyderabad
May 7, 2024 14: 18 PM
Slider ముఖ్యంశాలు

క్యాన్సర్ కారక పెయింటింగ్ యూనిట్ ను  ఎత్తివేయాలి

#paintingunit

క్యాన్సర్ కారక పెయింటింగ్ యూనిట్ ను వెంటనే ఎత్తివేయాలని సిసిఎస్, సాయి నగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  ఆందోళన చేపట్టారు. శనివారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని సాయి నగర్ లో ఏర్పాటు చేసిన క్యాన్సర్ కారక కార్ల పెయింటింగ్ యూనిట్ ను తక్షణమే ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ  కాలనీవాసులు యూనిట్ ఎదురుగా పెద్ద ఎత్తున ఆందోళన కు దిగి గంటకు పైగా బైఠాయించారు.

కాలనీలోని ఇండ్ల మధ్యన ఏర్పాటు చేసిన కార్ల పెయింటింగ్, డెంటింగ్ యూనిట్ ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. క్యాన్సర్ కారక పరిశ్రమపై జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చర్లపల్లి కాలనీల సమాఖ్య (సిసిఎస్), సాయి నగర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎంపల్లి పద్మారెడ్డి, సారా వినోద్ ముదిరాజ్, కోడికంటి అచ్చయ్య, శ్రీధర్ రెడ్డి లు మాట్లాడుతూ తాము నెలరోజుల క్రితం జిహెచ్ఎంసి అధికారులకు వినతి పత్రం సమర్పించిన అధికారులు చర్యలు చేపట్టక మౌనంగా ఉండడంలోని అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

ఇకనైనా ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్యాన్సర్ కారక కార్ల పెయింటింగ్, డెంటింగ్ యూనిట్ పై తక్షణమే చర్యలు తీసుకోని యూనిట్ ను మూసి వేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మహిళలు సుభాషిని రెడ్డి, భాగ్యమ్మ, భాగ్యలత, లక్ష్మి, కవిత, అమర్నాథ్, శ్రీధర్ రెడ్డి, విశ్వనాథం, హరినాథ్ రెడ్డి, శంకర్, నర్సింహారెడ్డి, సిద్ధారెడ్డి, నాగేశ్వరరావు, సిద్ధారెడ్డి, శ్రీశైలం, వెంకటేష్, ప్రేమ్, కృష్ణకుమార్, బాల్ రాజ్, యాదగిరి, తిరుపతిరెడ్డి, అభిరామ్, మురళి తదితరులు పాల్గొన్నారు.

Related posts

జస్టిస్ ఫర్ దిశ: తెలంగాణేతర ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్టుమార్టం

Satyam NEWS

రైతులను చూసి పైశాచికానందం పొందుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం .

Bhavani

క్వశ్చన్ అవర్: బిజెపితో హనీమూన్ పిరియడ్ ముగిసిందా?

Satyam NEWS

Leave a Comment