41.2 C
Hyderabad
May 4, 2024 16: 19 PM
Slider విశాఖపట్నం

ఉత్తరాంధ్ర కల్పవల్లి పండుగ బందోబస్తు పై డీఐజీ ప్రత్యేక దృష్టి

#dig

విశాఖ రేంజ్ డీఐజీ ఎస్.హరికృష్ణ, విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక లు  నగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయ ప్రాంగణం, మూడు లాంతర్లు, కమాండ్ కంట్రోల్, కోట జంక్షన్, అయోధ్య మైదానం, గంట స్తంభం, హుకుంపేట ప్రాంతాలను సందర్శించారు. శ్రీ పైడితల్లి అమ్మవారి తోలేళ్లు పండగ భద్రత ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. భక్తులు రాత్రి సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు విధులు నిర్వహించాలని అధికారులను విశాఖ రేంజ్ డీఐజీ ఆదేశించారు..విశాఖ రేంజ్ డీఐజీ వెంట జిల్లా ఎస్పీ ఎం.దీపిక, , అదనపు ఎస్పీ కుమారి ఎన్.శ్రీదేవీరావు, పి.సత్యనారాయణ రావు,  పలువురు డీఎస్పీ శేషాద్రి త్రినాథ్ రావు , సిఐలు వెంకటరావు ,మరియు ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Related posts

హామీలు నెరవేర్చలేక ప్రజాదరణ కోల్పోయిన లిజ్ ట్రస్

Satyam NEWS

విదేశీ మద్యం బ్రాండ్లను అక్రమంగా తయారుచేసే దంపతుల అరెస్టు

Satyam NEWS

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో గురు పౌర్ణమి సీతారాముల కల్యాణోత్సవం…

Bhavani

Leave a Comment