27.7 C
Hyderabad
May 4, 2024 07: 55 AM
Slider మహబూబ్ నగర్

అధికార పార్టీ మంత్రుల ధాన్యం దోపిడి

#ricemill

అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, పౌరసరఫరాల శాఖ అధికారులు కలిసి ధాన్యం దోపిడీ చేస్తున్నారని బి. కృష్ణ ఆరోపించారు. ఆదివారం వనపర్తి జిల్లా చిట్యాలలో  అధికార పార్టీకి చెందిన వ్యవసాయ మంత్రి అనుచరులు, పౌరసరఫరాల అధికారులు చేతులు కలిపి సీఎంఆర్ కింద మిల్లర్లకు ఇచ్చే వరిధాన్యాన్ని దోపిడీ చేస్తున్నారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కృష్ణ ఆరోపించారు.

చిట్యాలలో గోదాముని సేకరించి అందులో రైస్ మిల్లు కు సంబంధించిన మిషనరీ లేకుండా, విద్యుత్ లేకుండా వారికి సీఎం ఆర్ కింద ధాన్యాన్ని కేటాయించారని సేకరించిన ధాన్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని కోట్లల్లో దోపిడీ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రెండేళ్లుగా సీఎంఆర్ కేటాయింపు అక్రమాల వెనుక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పురసరఫల శాఖ అధికారులు లోపాయి ఒప్పందాన్ని బహిర్గతం చేయడానికి బిజెపి నాయకులు గోదాము సందర్శించి అవకతవకలను బయటపెట్టారు. రాష్ట్రస్థాయిలో కెసిఆర్ దోచుకుంటుంటే ఇక్కడ మంత్రి అండదండలతో ఇక్కడి దొరలు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులతో పాటు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు ఇస్తున్నట్లు కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలోనే జిల్లా కేంద్రంలో ఇటువంటి అవినీతికి పాల్పడ్డ ఓ మిల్లర్ ను ఫిర్యాదు చేసి ఆ వ్యాపారిని జైలుకు పంపించామని మరల ఇప్పుడు అదే తరహాలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రి నిరంజన్ రెడ్డికి ఇటువంటి అవినీతి కనిపిస్త లేదా అని ప్రశ్నించారు.

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ జింకల కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి డి. నారాయణ, జిల్లా అధికార ప్రతినిధి,మీడియా ఇంచార్జ్ పెద్దిరాజు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, కో కన్వీనర్ దాసరాజు ప్రవీణ్, మండల ప్రధాన కార్యదర్శి పోతు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు కాటమోని శ్రీనివాస్ గౌడ్, బూత్ కమిటీ అధ్యక్షులు జంగిడి యాదగిరి, చెంబుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సారీ రోశయ్య గారూ… మిమ్మల్ని మర్చిపోయాం….

Satyam NEWS

గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ

Satyam NEWS

విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్లను తనిఖీ చేసిన ఎస్పి

Satyam NEWS

Leave a Comment