33.7 C
Hyderabad
April 29, 2024 00: 43 AM
Slider చిత్తూరు

తిరుపతి గంగమ్మ రాజకీయాల్లోకి వచ్చిందా?

#gangamma

గంగమ్మ తల్లి రాజకీయాల్లోకి వచ్చిందా? వైసీపీ తరపున పోటీ చేయబోతున్నదా? తిరుపతిలో వైసీపీ నేతలు చేస్తున్న హడావుడి చూస్తుంటే గంగమ్మ తల్లి వారి పార్టీలో చేరినంత హడావుడి చేస్తున్నారు. గంగమ్మ జాతర తిరుపతిలో వందల సంవత్సరాలుగా జరుగుతున్నది. కానీ ఇప్పుడు గంగమ్మ జాతరను పూర్తిగా రాజకీయం చేసేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ గంగమ్మ జాతరను కమర్షియల్ చేసేశారు. సాంప్రదాయాలకు విరుద్ధంగా గంగమ్మకు పబ్లిసిటీ చేసేస్తున్నారు. ఇదంతా చేస్తున్నది భక్తితో అనుకుంటే పొరబాటే.

ఇదంతా రాజకీయం కోసం…. త్వరలో రానున్న ఎన్నికల కోసం మాత్రమే చేస్తున్నారనేది నిర్వివాదాంశం. ఖర్చుచేస్తున్నది కూడా సొంత డబ్బులు కాదు. షాపుల నుంచి వ్యాపారుల నుంచి బలవంతంగా చందాలు వసూలు చేశారనేది బహిరంగ రహస్యం. కోట్లాది రూపాయలు చందాలు వసూలు చేసి ఖర్చు చేస్తున్నది కేవలం తమ స్వార్ధం కోసమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయలు చందాలు వసూలు చేసిన వారు గంగమ్మ తల్లి ఆలయాన్ని అభివృద్ధి చేస్తే కొంత వరకూ సరిపెట్టుకోవచ్చు కానీ కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే ఖర్చు చేస్తూ గంగమ్మ ను వ్యాపార వస్తువుగా మార్చేస్తున్నారనేది భక్తుల ఆరోపణ.

స్థానిక ఎమ్మెల్యే పేరుతో జరుగుతున్న ఈ తంతు మొత్తం స్థానికులకు వెగటు పుట్టిస్తున్నది. మైకుల మోతతో తిరుపతి నగరం హోరెత్తిపోతున్నది. రోజుకు ఒక వీఐపి వచ్చి గంగమ్మ జాతరలో పాల్గొంటున్నాడు. వచ్చిన ముఖ్య అతిధి స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని పొగడడమే పనిగా పెట్టుకుంటున్నారు. గంగమ్మ జాతర గురించి భక్తితో కొలవాల్సిన ఆవశ్యకత గురించి ఎవరూ చెప్పడం లేదు.

గంగమ్మ పేరుతో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డిని ఇలా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గంగమ్మ విగ్రహాన్ని కూడా మార్చి తమ దైన శైలిలో గంగమ్మను కమర్షియల్ చేసేస్తున్నారు. తిరుపతి గ్రామ దేవత అయిన గంగమ్మ ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల నుంచి తనను రక్షించమని వేడుకుంటున్నది. తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాలను పాలగొందులు పాలించినప్పుడు స్త్రీలపై అఘాయిత్యాలు విపరీతంగా ఉండేవి. ఈ సమయంలో అవిలాల గ్రామంలో గంగమ్మ దేవత చాలా అందమైన స్త్రీగా జన్మించింది.

పాలెగొందులు గంగమ్మ దేవికి హాని చేయాలనుకున్నప్పుడు, ఆమె తన శక్తితో అతన్ని చంపడానికి ప్రయత్నించింది. ఆమెకు భయపడి పాలెగొందులు మారుమూలలో తలదాచుకున్నాడు. అతన్ని అజ్ఞాతం నుండి బయటకు తీసుకురావడానికి గంగమ్మ గంగా జాతర నిర్వహించి విచిత్ర వేషధారణతో ఆకర్షించి బయటకు వచ్చేలా చేస్తుంది. ఏడవ రోజున పాలెగొందులు అజ్ఞాతం నుండి బయటకు రాగా గంగమ్మ అతడిని చంపుతుంది. గంగమ్మ జాతరను తేళ్లాయ మిరాసి ఆచారి కుటుంబీకులు నిర్వహిస్తారు.

ఈ జాతర సందర్భంగా భక్తులు రకరకాల వేషధారణ చేస్తారు. వీటన్నింటిని కూడా వైసీపీ నాయకులు పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు. అదే ఇప్పుడు తిరుపతిలో చర్చనీయాంశం అయింది. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఇప్పుడు స్వయంగా వేరే వేషం వేసుకుని ఈ రాజకీయ నాయకుల బారి నుంచి తప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Related posts

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

Bhavani

శాల్యూట్ టు ఏ పి పోలీస్: కిందిస్థాయి పోలీసులకు డిజిపి కితాబు

Satyam NEWS

నియంత పాలన ఇంకానా…. ఇంకెంత కాలం??

Satyam NEWS

Leave a Comment