28.7 C
Hyderabad
May 5, 2024 07: 41 AM
Slider హైదరాబాద్

గోల్నాక డివిజన్ లో పట్టణ ప్రగతి కార్యక్రమం

#amberpet

హైదరాబాద్ అంబర్ పేట్ నియోజకవర్గం గోల్నాక డివిజన్ లో పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగింది. అన్నపూర్ణ నగర్, లాల్ బాగ్, గవర్నమెంట్ కోటర్స్ తదితర ప్రాంతాల్లో అధికారులు పాదయాత్ర చేశారు.

ఈ సందర్భంగా ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొన్నిచోట్ల ఐరన్  కరెంట్ పోల్స్ కారణంగా కరెంట్ షాక్ వస్తున్నదని అందువల్ల వాటిని తీసి సిమెంట్ పోల్స్ పెట్టమని స్థానిక ప్రజలు కోరారు.

మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు, స్ట్రీట్ లైట్స్, కొన్ని చోట్ల రోడ్డు ప్యాచ్ వర్క్, రెండు పని చేయనివి బోరింగ్లు రిపెర్ చేయించాలని, తదితర అంశాలను స్థానికులు వారి దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సమస్యలన్నిటినీ సంబంధిత అధికారులకు తెలియచేసి వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు హామి ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ వేణు గోపాల్, డి.ఈ. సుధాకర్ , జలమండలి మేనేజర్ రోహిత్, జలమండలి ఇన్స్పెక్టర్ మనోహర్, జిహెచ్ఎంసి ఎస్.ఎఫ్.ఎలు, మలేరియా ఎస్ఎఫ్ఏ, జలమండలి అధికారులు,

విద్యుత్ శాఖ అధికారులు, స్ట్రీట్ లైట్స్ అధికారులు, పారిశుద్ధ కార్మికులు, స్థానిక బస్తి పెద్దలు, నర్సయ్య , ప్రసాద్, కే శ్రీనివాస్, గఫూర్, లక్ష్మణ్,

టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ కె బాబు, నర్సింగ్ యాదవ్, రేడ్డపాక రాము, రాజు, ఉమేష్, శ్రావణ్, సతీష్ , రాజేష్, రాము, ప్రణీత్, మహిళా సోదరీ సోదరీమణులు సుమతి, వసంత, ధనలక్ష్మి, మనోహర, రేణుక, యువత తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనాతో హౌసింగ్  బోర్డు డిప్యూటీ ఈఈ శ్యామల్  మృతి

Satyam NEWS

ఏ కొబ్బ‌రి మొక్కో.. నాటి మామిడికాయ‌లు ర‌మ్మంటే వ‌స్తాయా..?

Satyam NEWS

థియేట‌ర్ల రీ ఓపెనింగ్ జీవో జారీ

Sub Editor

Leave a Comment