దిశ అత్యాచారం, హత్య ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సీనియర్ నటుడు సుమన్ తీవ్రంగా ఖండించారు. మహిళలపై అత్యాచారం చేసిన వారికి రెండు దెబ్బలు చాలని పవన్ కళ్యాణ్ అనడం దారుణమని సుమన్ అన్నారు. అలాంటి ఘటనలు వారింట్లో జరిగితే పవన్ ఇలాగే అంటారా అని ప్రశ్నించారు.
గురువారం సుమన్ మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనల్లో బాధితుల ఆవేదనను అర్థం చేసుకుని మాట్లాడాలని పవన్‌కు హితవు పలికారు. అదే విధంగా అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.