38.2 C
Hyderabad
May 3, 2024 21: 35 PM
Slider అనంతపురం

వృద్దా శ్రమంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు…

#Pawan Kalyan

జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ 53 వ.పుట్టినరోజు వేడుకలను రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలోని ఎస్టి కాలనీ గ్రామంలో శనివారం కేకు కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

అనంతరం ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్య సన్నిధిలో,భాకరాపేట గ్రామ శివారులో ఉన్న శ్రీ పరమాత్మ వృద్ధాశ్రమం,పోరుమామిళ్ల సమీపంలోని వివేకానంద సేవా ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి వృద్ధులకు దుస్తులను పంపిణీ చేశారు.ఈసందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ,జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుడిలా భావిస్తున్నారని అందుకే ఆయన పుట్టినరోజును ప్రజలందరూ, నిర్వహించుకోవడం గమనార్హమన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నేడు జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ సంబరాలే దీనికి ఉదాహరణ అని అన్నారు.పవన్ అభిమానులు జనసేన సైనికులు ప్రజలు ఒక పండుగలా పవన్ కళ్యాణ్ పుట్టినరోజులు నిర్వహించడం రాష్ట్రానికి కొత్త నాయకత్వాన్ని ఆహ్వానించడమేనన్నారు.

ఆయన పుట్టిన రోజున సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావంతోనే రాజకీయాల్లో పెను మార్పులు మొదలయ్యాయని జనసేన పార్టీ అధికారంలోకి వస్తే భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు ఖాయమన్నారు.ఈకార్యక్రమంలో జనసేన వీర మహిళలు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

న్యూ వెపన్: ఐదు వేల కిలోమీటర్ల లక్ష్యంతో బాలిస్టిక్ క్షిపణి

Satyam NEWS

సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరికి అస్వస్థత

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: చిలుకూరు బాలాజీ టెంపుల్ కు నో ఎంట్రీ

Satyam NEWS

Leave a Comment