36.2 C
Hyderabad
May 12, 2024 16: 03 PM
Slider ఖమ్మం

ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు

#Ganesh celebrations

ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. ఐడిఓసి కార్యాలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, పంచాయతి రాజ్, అగ్నిమాపక, విద్యుత్, మున్సిపల్ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకావాలని అన్నారు. అన్ని గణేష్ మండపాలను తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ముందస్తుగా గణేష్ మండలి నిర్వాహకులు పూర్తి వివరాలు అందించాలని, ఇది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ, మండల స్థాయిలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశాలు నిర్వహించాలని చెప్పారు.

గణేష్ నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు నుండి నిమజ్జనం వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రశాంత వాతావరణంలో అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా నిర్వహించాలని చెప్పారు. మండపాలకు విద్యుత్ ఏర్పాటుకు తప్పని సరిగా విద్యుత్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలుపై విద్యుత్ అధికారులు మండపాల్లో ఆడిట్ నిర్వహించాలని చెప్పారు.

విద్యుత్ తీగలకు తగల కుండా ఎత్తు తక్కువ ఉండే విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. మండపాల్లో మైక్ ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని చెప్పారు. మన జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి నిమజ్జనానికి విగ్రహాలు వచ్చే అవకాశం ఉన్నందున యంత్రాంగం సూచించిన ప్రాంతాల్లో మాత్రమే అత్యంత భద్రత మధ్య నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు.

గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకోవాలని, గణేష్ విగ్రహం నిమజ్జనం చేసుకునేందుకు అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని చెప్పారు. నిమజ్జనం రూట్ లో అవసరమైన రోడ్డు మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు.

వినాయక నిమజ్జనానికి వినియోగించే వాహనాలను ముందస్తుగా రవాణా శాఖ అధికారి నుండి ధ్రువీకరణ తీసుకోవాలని చెప్పారు. ప్రతి గణేష్ మండపం వద్ద అవసరమైన మేర బందోబస్తు ఏర్పాటు చేయాలని, గణేష్ నిమజ్జనం సజావుగా జరిగే విధంగా కట్టు దిట్టమైన భద్రత వ్యవస్థ ఏర్పాట్లుచేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.

గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తిపాటలు మాత్రమే వినిపించాలని, మతాలు, వర్గాల మనోభావాలను గౌరవించాలని చెప్పారు. అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి రెచ్చగొట్టే అంశాల జోలికి వెళ్లవద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ కోరారు.

గణేష్ నిమజ్జనం సందర్భంగా క్రేన్లు వినియోగించాలని, గణేష్ నిమజ్జనం జరిగే ప్రదేశాలలో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సహకారంతో కలిసికట్టుగా పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని చెప్పారు. భక్తులకు అందించే స్వామి వారి ప్రసాదాలకు ప్లాస్టిక్ వస్తువులు వినియోగించొద్దని పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని చెప్పారు.

వ్యర్థాలు వేసేందుకు డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలని, రసాయనాలు, ప్లాసర్ ఆఫ్ పారిస్ తో చేసే విగ్రహాలు పర్యావణానికి హానికలిగిస్తాయన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ఉచిత మట్టిగణపతులు పంపిణీ చేయనున్నామని, ప్రజలు మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ రవీందర్, ఏఎస్పీ పరితోష్ పంకజ్, డిపిఓ రమాకాంత్, మిషన్ భగీరథ ఈ ఈ తిరుమలేష్, మున్సిపల్ కమిషనర్లు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కె.రంగాకిరణ్, దారా రమేష్, వందనపు శ్రీధర్, జి.వెంకటేశ్వరరావు, చింతల చెరువు శ్రీనివాస్ రావు, జల్లారపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అంకిత్ శర్మ హత్యకేసులో తాహిర్ హుస్సేన్ అరెస్టు

Satyam NEWS

స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదం పై చదలవాడ దిగ్భ్రాంతి

Satyam NEWS

అభ్య‌ర్థుల‌ను మార్చ‌క‌పోవ‌డ‌మే కారు బోల్తాకు కార‌ణం?!

Sub Editor

Leave a Comment