33.2 C
Hyderabad
May 4, 2024 03: 02 AM
Slider నిజామాబాద్

పెండింగ్ పనులు తర్వగా పూర్తి చేయాలి

#Bichkunda Tahaseeldar

బిచ్కుంద మండల కేంద్రంలో రెవెన్యూ కార్యాలయంలో గ్రామ రెవెన్యు అధికారుల సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకట్రావు  మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎలాంటి పనులు పెండింగ్ లేకుండా పూర్తిచేయాలని అన్నారు.

గ్రామాల పరిధిలో గల చెరువులు వాటి విస్తీర్ణం వివరాలను కంప్యూటర్ లో పొందుపరచాలని, గతంలో పట్టా భూములలో నిర్మించుకున్న ఇండ్ల వివరాలను సేకరించి నాల కన్వర్షన్ చేయించి రెవెన్యూ రికార్డుల నుండి ఆ భూములను తొలగించి సరి చేయాలన్నారు.

మండలంలో 99 శాతం రైతులకు నూతన పట్టా పాసు పుస్తకాలు అందించామని, త్వరగా నూరు శాతం పాస్ పుస్తకాలు అందివ్వడానికి గ్రామ రెవెన్యూ అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు. గత మూడు నెలల నుండి కరోనా సమయంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేయాలని, జిల్లా అధికారుల ఆదేశానుసారం తహసిల్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటాలని అన్నారు. ఎవరైనా తమ విధుల పట్ల అశ్రద్ధ వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారులు హర్ష, సాయిలు, ఆయా గ్రామాల రెవెన్యూ అధికారులు ఉన్నారు.

Related posts

రేపటి బంద్ కేసీఆర్ కు చెంపపెట్టు లాంటిది

Satyam NEWS

చీమలపాడు ప్రమాద బాధితులను ఆదుకోవాలి

Satyam NEWS

కాలనీ వాసులు ధర్నా.. డాంబార్ ప్లాంట్ మూసివేత

Bhavani

Leave a Comment