38.2 C
Hyderabad
May 3, 2024 21: 57 PM
Slider మహబూబ్ నగర్

ప్రజా సమస్యలపై అధికారులు నిలదీసిన బాలాజీ సింగ్

#KalwakurthyZP

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తిరుమల పంక్షన్ హాల్ లో జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్  వైస్ చైర్మన్ బాలాజిసింగ్ పాల్గొని పలు  ప్రజా సమస్యలపై అధికారులను నిలదీశారు.

KLI కాలువలో భూమిని కోల్పోయిన  వంగూర్, చారకొండ, వెల్డండ మండలాల్లోని  రైతులకు కెసిఆర్  జిల్లాలోని ప్రాజెక్ట్ లకు కేటాయించిన నిధుల నుండి మొదటి ప్రాధాన్యతలో భాగంగా రైతులకు నష్ట పరిహారం  చెల్లించాలని, అదేవిధంగా జూపల్లి రైతుల నష్టపరిహారం గురించి పలు సార్లు కలెక్టర్ కు విన్నవించమన్నారు.

రైతుల తరువాతనే  కాంట్రాక్టర్లకు  నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. రాబోయే జనరల్ బాడీ సమావేశంలోగా కొత్త గ్రామపంచాయతీ లో రేషన్ షాప్స్ ఏర్పాటుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జిల్లా ఆసుపత్రి కమిటీ వేసి ప్రజారోగ్యం లో మెరుగైన వైద్యం ప్రజలకు అందేలా చూడాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ కు , మండల , గ్రామపంచాయతీ నిధుల కోసం ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు స్యాండ్ పాలసీ తీసుకురావాలని గ్రామపంచాయతీ, మండల,జిల్లా పరిషత్ లకు నిధుల పంపిణీ చేయొచ్చు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా చైర్ పర్సన్,జిల్లా కలెక్టర్ శర్మన్ , MP రాములు , ప్రభుత్వ విప్ అచ్చంపేట MLA గువ్వల బాలరాజు ,జిల్లా CEO , వివిధ మండలాల ZPTC లు, MPTC లు, కో ఆప్షన్ మెంబెర్స్ లు, వివిధ డిపార్ట్మెంట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు

Satyam NEWS

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం

Satyam NEWS

స్వచ్చ దర్పణ్ లో తెలంగాణ సత్తా

Satyam NEWS

Leave a Comment