29.7 C
Hyderabad
May 6, 2024 04: 25 AM
Slider వరంగల్

దివ్వాంగుల సేవ మాధవ సేవతో సమానం

#anitareddy

మల్లికాంబ మనోవికాస కేంద్రం, హన్మకొండ ఆధ్వర్యంలో నేడు ప్రపంచ వికలాంగుల దినోత్సవ వారోత్సవాలలో భాగంగా “మానసిక దివ్యాంగుల అభివృద్ధికి క్రీడలు” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా సంస్థ జాయింట్ సెక్రటరి ప్రొఫెసర్ పద్మ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా హాజరు అయిన మాజీ చైర్ పర్సన్, చైల్డ్ వెల్ఫర్ కమిటి కరుకాల అనితారెడ్డి మాట్లాడుతూ, “మానసిక దివ్యాంగుల బాల,బాలికల సేవ చేయడం మానవసేవే- మాధవసేవ అని అన్నారు. ప్రతి తల్లిదండ్రి తమకు పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కోరికలను పెట్టుకోని నవమాసాలు మోసో వారికి జన్మనివ్వడం ప్రకృతి ధర్మం అని అన్నారు. ముఖ్యంగా జన్యుపరమైన లోపాల కారణంగా కొంతమంది పిల్లలు బుద్ధిమాంద్యం, అంగ వికలాంగులుగా జన్మించడం జరుగుతుందని అన్నారు. వీరందరినీ చేరదీసి వారికి అన్నివిధాలుగా ప్రేమ ఆప్యాయాతలను పంచుతూ వారిని అభివృద్ధి చేస్తున్నటువంటి ఉపాధ్యాయ వర్గానికి చాలా ప్రశంసనీయం. మానసిక దివ్యాంగుల బాలబాలికలు క్రీడలలో ప్రోత్సాహిస్తే ఉన్నతులుగా ఎదుగుతారు” అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ చైల్డ్ వెల్ఫెరం కమిటీ చైర్ పర్సన్ మండల పరుశరాములు, బండ సదానందం, కోడం, కళ్యాణ్, సిబ్బంది బాలబాలికలు పాల్గొన్నారు.

Related posts

విజయ్ దివస్ సందర్భంగా స్వర్ణ విజయ జ్యోతి

Satyam NEWS

ఫుడ్ బిజినెస్ లోకి ప్రవేశించిన ఆనంద్ దేవరకొండ

Satyam NEWS

సాయం కోసం భిక్షాటన చేసిన నటుడు షకలక శంకర్

Satyam NEWS

Leave a Comment