29.7 C
Hyderabad
May 6, 2024 06: 27 AM
Slider నిజామాబాద్

మహిళా సంఘాల బకాయిలు విడుదల చేయకుంటే ఆమరణ దీక్ష

#womenprotest

మహిళ సంఘాలకు రావాల్సిన బకాయి నిధులమి విడుదల చేయకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి సీఎం కేసీఆర్ కు హెచ్చరిక జారీ చేశారు. నిధుల విడుదలకు రెండు రోజులు సమయం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. మహిళా సంఘాలకు రావాల్సిన శ్రీనిధి, అభయహస్తం, వడ్డీలేని రుణాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా బీజేపీ.కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి ఎంపీడీఓలకు వినతిపత్రాలు అందజేశారు. నేడు అన్ని మండలాల మహిళలతో కలిసి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు.

జిల్లా కేంద్రంలోని గంజ్ మార్కెట్ నుంచి ధర్మశాల, ఇందిరా చౌక్, రైల్వే కమాన్ మీదుగా నిజాంసాగర్ చౌరస్తా వరకు సుమారు 6 వేల మంది మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు. నిజాంసాగర్ చౌరస్తాలో బహిరంగ సభలో వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. కామారెడ్డి నియోజకవర్గంలో మొత్తం 7 వేలకు పైగా మహిళా సంఘాలున్నాయని, వీటికి సుమారుగా 52 కోట్ల రూపాయలు రుణాలు ప్రభుత్వం 8 ఏళ్లుగా బకాయి పడి ఉందన్నారు. 2 వేల పించన్, 4 వేల రైతు బంధు ఇచ్చి రుణాలు ఇవ్వడంలో ప్రభుత్వం ముఖం చాటేస్తుందన్నారు.

మహిళా సంఘాలు తీసుకునే రుణాలకు ప్రభుత్వం రూపాయి వడ్డీ అని చెప్తున్నా చివరి వరకు చూస్తే 2.10 రూపాయలు వడ్డీ పడుతుందన్నారు. రుణాలు తిరకముందే మళ్ళీ రుణాలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తూ అత్యధిక వడ్డీ వసూలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ ఖాతాల్లో జమ చేయకపోవడంతో మహిళలు అనేక విధాలుగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించాలని, లేకపోతే ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుందాన్నారు. కామారెడ్డిలో ఉద్యమం మొదలైతే ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి దారి తీస్తుందో సీఎం కేసీఆర్ కు తెలిసే ఉంటుందన్నారు.

ఇక్కడ ఉన్న మహిళలతోనే ఉద్యమం ఆగిపోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి దారి తీసే విధంగా చూడొద్దన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రేపు, ఎల్లుండి ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని, సోమవారం లోపు రుణాలు జమచేయకపోతే సోమవారం నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 6,7,8,9 తేదీల్లో మహిళలతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముందు నిరాహార దీక్షలు చేపడతామని, అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే 10 వ తేదీ నుంచి మహిళలతో కలిసి ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తదో.. మా ప్రాణాలు పోవడమో ఏదో ఒకటి జరుగుతుందని తేల్చి చెప్పారు.

నిజాంసాగర్ చౌరస్తాలో బహిరంగ సభ

Related posts

బొడ్రాయి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

Satyam NEWS

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Bhavani

అధిక వర్షాలతో కుదేలైన ఆదిలాబాద్ జిల్లా సోయా, పత్తి రైతు

Satyam NEWS

Leave a Comment