40.2 C
Hyderabad
May 5, 2024 16: 01 PM
Slider ప్రత్యేకం

ఆటిజం నివారణకు పిన్నాకిల్ బ్లూమ్స్ ప్రతిపాదన

ministerharishrao

ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావును కలిసిన ప్రతినిధి బృందం

మందులతో చికిత్స లేని ఆటిజం, సెన్సోరియల్ డిజార్డర్స్ నియంత్రణకై కృషిచేస్తున్న నెంబర్ వన్ సంస్థ పిన్నాకిల్ బ్లూమ్స్ ప్రతినిధులు నేడు తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావుని తన నివాసంలో కలిసారు. ఈ సందర్భంగా మంత్రి పినాకిల్ బ్లూమ్స్ సంస్థ ఆటిజం నియంత్రణకు చేస్తున్న కృషిని అభినందించారు. సంస్థ ప్రతినిధులు మంత్రికి పినాకిల్ సేవల్ని వివరించారు.

గతంలో పదివేల మందికి ఒకరు ఆటిజంతో బాధపడుతుంటే ప్రస్తుతం ప్రతీ 32మందిలో ఒకరు సెన్సోరియల్ డిజార్డర్స్ తో ఇబ్బందులు పడుతున్నారని, వీరికి సంపూర్ణ చికిత్స లేకున్నా, ఎన్నో శాస్త్రీయ అధ్యయనాలతో సైంటిఫిక్ థెరపీలను రూపొందించిన పినాకిల్ బ్లూమ్స్ వందకు పైగా సెంటర్ల ద్వారా నిష్ణాతులైన శిక్షకులతో దాదాపు 18లక్షల మందికి 1:1 మెథడ్లో 97శాతం ఖచ్చితత్త్వంతో నివారణ కల్పించిందన్నారు.

చిన్నవయసులో సమస్యను గుర్తించి చికిత్స అందించడం ద్వారా గణనీయమైన మార్పు కనిపిస్తుందన్నారు. అలాగే సేవా పౌండేషన్ పేరుతో ఎంతో మందికి ఉచితంగా ఓటీ, బీటీ, ఎస్ టీ, వంటి ఆటిజం సర్వీసుల్ని అందిస్తుందని భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఆటిజంపై పోరు సలపడానికి మంత్రికి ప్రణాళికల్ని వివరించారు.

సమాజానికి మంచి చేస్తున్న పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ ప్రతిపాధనలపై మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పినాకిల్ బ్లూమ్స్ హార్వెస్ట్ ఆఫీసర్ శివ సతీష్ వేముల, ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్ జయవీర్, ప్రతినిధులు ముసారెడ్డి, ఏం. మహేశ్వరి పాల్గొన్నారు.

Related posts

మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయండి

Bhavani

ముహూర్తం ఫిక్స్: ఆగస్టు 13న విశాఖకు జగన్

Satyam NEWS

పనిషుడ్:ముజఫర్‌పూర్ షెల్టర్ హోం దోషులకు యావజ్జీవం

Satyam NEWS

Leave a Comment