32.2 C
Hyderabad
May 8, 2024 21: 53 PM
Slider హైదరాబాద్

ప్రజల సమస్యలు పరిష్కారించడమే నా ధ్యేయం

#amberpet

హైదరాబాద్ లోని అంబర్ పేట్ లో ఫ్లై ఓవర్ నిర్మాణం చేస్తున్న సమయంలో మంచి నీటి పైప్ లైన్ పగిలి పోవడంతో రఘునాథ్ నగర్ లో గత కొన్ని రోజులుగా నల్ల నీరు రావడం లేదు. స్థానికులు జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు, అంబర్ పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ దృష్టికి ఈ విషయం తేవడం తో వెంటనే స్పందించారు.

పైప్ లైన్ లీకేజీ  ప్రాంతాన్ని స్థానిక బస్తీ ప్రజలతో కలిసి పరిశీలించి, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. అలాగే ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్టర్ ని పిలిపించి, వెంటనే పైప్ లైన్ మరమ్మతులు చేయాలని, అప్పటి వరకూ స్థానిక బస్తి ప్రజలకు వాటర్ ట్యాంకర్స్ ద్వారా మంచి నీరు అందించాలని కోరారు.

రఘునాథ్ నగర్ లో స్థానిక బస్తీ ప్రజలతో కలిసి విద్యుత్ స్తంభాల సమస్యని, డ్రైనేజీ సమస్యని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బస్తీ ప్రజలు లలిత, మహేశ్వరి, లావణ్య, మంగ, లక్ష్మి, ప్రవీణ్, అశోక్, రమేష్, కృష్ణ, పెంటేష్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు లింగారావు, మహేష్ ముదిరాజ్, సూరజ్, వేణు, మహేష్, ప్రవీణ్, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.కోటి విరాళం

Satyam NEWS

కేంద్ర ప్రభుత్వ మోటార్ వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా రాస్తారోకో

Satyam NEWS

ఉమ్మడి ఆదిలాబాద్ లో టిక్కెట్ల పంచాయితీ

Satyam NEWS

Leave a Comment