ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా ఈసారి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పరిశ్రమలు, ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 17వ తేదీన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు తన 66 వ సంవత్సరంలో కి అడుగుపెట్టనున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా గ్రీన్ కవర్ ని పెంచేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి మొక్కల పెంపకం పట్ల ఇష్టాన్ని చాటుకున్నరన్నారు.
ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం కార్యక్రమం లో పాల్గొనాలన్నారు. ఈ మేరకు తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లకు కూడా ఈ మేరకు కేటీఆర్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.