26.7 C
Hyderabad
April 27, 2024 10: 46 AM
Slider ముఖ్యంశాలు

విన్నింగ్ హార్స్: ఒలింపిక్ అయేసియేషన్ కు జయేష్ రంజన్

jayesh ranjan

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ విజయం సాధించారు. అధ్యక్ష పదవికి పోటీపడిన జయేష్ రంజన్‌కు 46 ఓట్లు రాగా, ప్రత్యర్థి రంగారావుకు 33 ఓట్లు వచ్చాయి. జయేష్ రంజన్‌తో పాటు వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థులు మహ్మద్ అలీ, ప్రేమ్‌రాజ్, సరల్ తల్వార్, వేణుగోపాలచారి గెలుపొందారు.

ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా జయేష్ రంజన్-రంగారావు ప్యానెళ్ల మధ్య కొనసాగింది. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మొదట ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అంతా భావించారు. అయితే రంగారావు, జయేష్ రంజన్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ప్రెసిడెంట్ పదవికి పోటీ పడటంతో ఏకగ్రీవ ఎన్నిక కుదరలేదు. నామినేషన్ల పర్వం ప్రారంభం అయిన తర్వాత కధ మరింత రసవత్తరంగా మారింది.

జితేందర్ రెడ్డి, జయేష్ రంజన్ నామినేషన్లు మొదట రిజక్ట్ అయ్యాయి. ఐఎఎస్ అధికారి అయిన జయేష్ రంజన్ క్యాట్ నుంచి పర్మిషన్ తీసుకోలేదనే సాకుతో ఆయనను రిజెక్ట్ చేశారు. అయితే రంగారావును జితేందర్ రెడ్డి బలబర్చడంతో అతని నామినేషన్ రిజెక్ట్ అయ్యింది. నామినేషన్ రిజెక్ట్ కావడంతో జయేష్ తరపున పానెల్ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టులో జయేష్ రంజన్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అతన్ని నామినేషన్ ఆమోదించాలంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోర్టు ఆదేశించడంతో ఒక్కసారిగా జయేష్ రంజన్ బరిలోకి వచ్చారు. దీంతో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Related posts

ప్లాస్టిక్ ను విచ్చలవిడిగా వాడటం పర్యావరణానికి హానికరం

Satyam NEWS

ప్రధాని మోదీ ఫస్ట్ విదేశీ టూర్ క్యాన్సిల్

Sub Editor

కోటప్పకొండ త్రికోటేశ్వర దేవస్థానానికి అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ గుర్తింపు

Satyam NEWS

Leave a Comment