37.2 C
Hyderabad
May 2, 2024 12: 50 PM
Slider ముఖ్యంశాలు

పెండింగ్ లో ఉన్న కేసుల సంగతేంటి…!

#nellimarla

నెల్లిమర్ల పీఎస్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీసు బాస్….! రాష్ట్ర డీజీపీ నుంచీ ఆదేశాలో లేక…వారాంతపు సమీక్ష లో ఏమో గాని ఏపీ రాష్ట్రంలో విజయనగరం జిల్లా పోలీసు బాస్…ఎస్పీ దీపికా…. ఆకస్మిక పర్యటన…అదే తనిఖీ కి ఉపక్రమించారు. ఈ ఆకస్మిక తనిఖీ లో భాగంగా విజయనగరం పోలీసు డివిజన్ పరిధిలోని నెల్లిమర్ల పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అదీ విజయనగరం ఇంచార్జ్ డీఎస్పీ లేకుండానే .. నెల్లిమర్ల పీఎస్ ను ఆకస్మికంగా సందర్శించారు. పోలీసు స్టేషను ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి…  స్టోర్ రూం ను తనిఖీ చేసి.., స్టేషను లో  రికార్డులు, సిడి ఫైల్స్ ను తనిఖీ చేసారు. పెండింగులో ఉన్న కేసుల్లో దర్యాప్తు త్వరితగతిన పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. అనంతరం, పోలీసు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భోగాపురం సిఐ విజయనాధ్, నెల్లిమర్ల ఎస్ఐ నారాయణరావు హాజరుగా ఉన్నారు.

Related posts

నేచర్ క్యూర్ హాస్పిటల్ క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన మేయర్

Satyam NEWS

కొత్త రేష‌న్‌కార్డుల జారీ, పేరు న‌మోదు ఎప్పుడో?

Sub Editor

వృధ్ధురాలి హత్యకేసు ఛేదించిన పార్వతీపురం పోలీసులు

Satyam NEWS

Leave a Comment