31.7 C
Hyderabad
May 7, 2024 00: 07 AM
Slider విజయనగరం

ప్రైవేటు పాఠశాలలు, కళాశాలకు క్రీడా ప్రాంగణాలు లేకపోతే గుర్తింపు రద్దు

#playground

విజయనగరం జిల్లాలో ఉన్న ప్రైవేటు పాఠశాలలు, కళాశాలకు క్రీడా ప్రాంగణాలు కచ్చితంగా ఉండాలని జిల్లా సంయుక్త కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు తన ఛాంబర్ లో జిల్లా విద్యా శాఖ కు సంబంధించి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్మెంట ప్రైవేటు, కళాశాలల్లో  తప్పనిసరిగా  క్రీడా స్థలాలు ఉండాలని,  లేని వాటికీ గుర్తింపు ఇవ్వకూడదని  సంయుక్త కలెక్టర్  డా. మహేష్ కుమార్ తెలిపారు.   క్రీడా మైదానాలు లేనందున విద్యార్ధులకు  క్రీడలకు అవకాశం ఉండడం లేదని, అటువంటి  పాఠశాలలను  గుర్తించి  సమీప క్రీడా ప్రాధికార సంస్థ కు చెందిన  క్రీడా మైదానాను వాడుకునే  అవకాశం కల్పించాలని  అన్నారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న  క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు,  ఉపాధి హామీ నిధులతో సర్వ శిక్షా అభియాన్ ద్వారా చేపట్టిన క్రీడా క్షేత్రాల పురోగతి పై ఆయా ఇంజినీరింగ్ సిబ్బందితో సమీక్షించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు  జిల్లా క్రీడా సంస్థ కు కొంత  యూజర్ చార్జి లను చెల్లించి క్రీడా మైదానాలను వినియోగించుకునేలా అన్ని పాఠశాలలకు ఒక సర్కులర్ పంపాలని జిల్లా విద్యా  శాఖాధికారి  సత్యసుధ కు ఆదేశించారు. ఈ సందర్భంగా క్రీడా మైదానాలు లేని ప్రైవేటు పాఠశాలలను గుర్తించాలని డి.ఈ.ఓ కు ఆదేశించారు.  అదే విధంగా కళాశాలల వారు కూడా వినియోగించుకునేలా చూడాలని ఆర్.ఐ.ఓ , డి.వి.ఈ.ఓ లకు ఆదేశించారు.   ప్రభుత్వ ఉద్యోగులకు కూడా  డిపార్టుమెంటల ఫెస్ట్ పేరుతో క్రీడా పోటీలను  నవంబర్ లో నిర్వహించనున్నట్లు తెలిపారు.  ఈ పోటీలకు  ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను  రూపొందించాలని సెట్విజ్ సి.ఈ.ఓ విజయ్ కుమార్ కు సూచించారు.  ఈ సమావేశం లో  చీఫ్ కోచ్ వెంకటేశ్వర రావు,  ఈ లు, డి ఈ లు శాప్ సిబ్బంది హాజరయ్యారు.

Related posts

మరో మూడు రోజుల పాటు వానలే వానలు

Satyam NEWS

పెట్రో ధరపై నరసరావుపేటలో ఎంఐఎం వినూత్న నిరసన

Satyam NEWS

కలిసి కొట్లాడకపోతే మిగిలేది ఉక్కు కాదు బూడిద

Satyam NEWS

Leave a Comment