37.7 C
Hyderabad
May 4, 2024 13: 24 PM
Slider కడప

సహాకరిస్తే కొద్ది కాలం బతుకుతాం, లేకుంటే అర్ధాంతరంగా పోతాం

rajampet DSP

కడప జిల్లా రాజంపేట డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పాటు భారతదేశంలో కి కరోనా వ్యాప్తి చెందిందని, కడప జిల్లాలో కి రాకూడదనే మా ప్రయత్నం అని తెలిపారు.

జనాలు బయటకు రావద్దని ప్రభుత్వం జీవో జారీ చేసిందని, పోలీస్ శాఖ 144 సెక్షన్ అమలు లోకి తెచ్చిందని తెలిపారు. దీన్ని జనాలు ఖాతరు చేయకుండా రోడ్ల పైకి వస్తున్నారని, దీని వల్ల ఇతరులు కూడా నష్ట పోతారని అన్నారు. యువకుల ద్వారా వృద్ధులకు పిల్లలకు త్వరగా వ్యాప్తి చెందుతోందని వివరించారు.

కర్ఫ్యూ నిబంధనలు పాటించని రాజంపేట లో ఎనిమిది మంది యువకుల బైకులు సీజ్ చేసి కేసులు నమోదు చేశామని, ఇవి ఇలాగే కొనసాగుతాయని తెలిపారు. యువత సహకరించక పోతే పెద్ద ఉపద్రం సంభవిస్తుందన్నారు. రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నా… తల్లి దండ్రులు పిల్లలను బయటికి పంపవద్దని ఆయన వేడుకున్నారు.  నిత్యావసర వస్తువుల కోసం గుంపులు వద్దని, ఒక్కరి తరువాత ఒక్కరు క్యూ లో తెచ్చుకోండని అప్పుడే వైరస్ వ్యాపించదని తెలిపారు. అందరూ సహాకరిస్తే కొద్దీ కాలం బ్రతుకుదామని, లేకుంటే అర్ధాంతరంగా పోతామని హెచ్చరించారు.

Related posts

ఫిబ్ర‌వ‌రి 19న విడుద‌ల కానున్న పొగ‌రు

Sub Editor

దివ్యాంగుల ప్రధాన డిమాండ్ పై కలెక్టర్ కరుణించే నా !

Bhavani

నాగపూర్ టు అమరావతి హైవే అలైన్మెంట్ మార్చాలి

Bhavani

Leave a Comment