33.7 C
Hyderabad
April 28, 2024 23: 46 PM
Slider ఖమ్మం

నాగపూర్ టు అమరావతి హైవే అలైన్మెంట్ మార్చాలి

#All Party Parties

నాగపూర్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం గతవారం జిల్లా పరిధిలోని రఘునాధపాలెం మండలంలో చేపట్టిన నిర్బంధ సర్వేని వ్యతిరేకిస్తూ, అంత క్రితం కనుమూరు వందనం గ్రామాల్లో పోలీస్ పహార మధ్య నిర్వహించిన సర్వే కి వ్యతిరేకంగా నాగపూర్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే అలైన్మెంట్ మార్చాలని భూనిర్వశిత జేఏసీ మరియు అఖిలపక్ష పార్టీలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది.

ఎస్ ఆర్ గార్డెన్ నుండి నిర్బంధ సర్వీస్ సిగ్గుచేటు అంటూ అలైన్మెంట్ మార్చాలని నినాదాలు చేస్తూ రైతు జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల నాయకులు,రైతులు పెద్ద ఎత్తున ప్రదర్శనగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు.

ఒక్కసారిగా రైతులు కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నిచ్చారు. అప్పటికే పోలీసులు కలెక్టరేట్ వద్ద భారీ దోబస్తును ఏర్పాటు చేశారు బార్కెట్లు పెట్టి కలెక్టరేట్ గేట్లను మూసివేశారు. కలెక్టరేట్ లోనికి వెళ్లే అందుకు యత్నించిన రైతులను రాజకీయ పార్టీల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు పోలీసులు మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాటకు దారితీసింది. కలెక్టరేట్ గేటు బయట ఆందోళన కొనసాగిoచారు.

ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నంనేని సాంబశివరావు లు మాట్లాడుతూ రైతుల భూ పోరాటం తీవ్ర స్థాయికి చేరింది. రైతులు చూపించే తెగువ, ధైర్యంతోనే పోరాటం విజయం సాధిస్తుందన్నారు. రైతుల పోరాటానికి సీపీఎం పార్టీ పూర్తిగా మద్దతిస్తుందన్నారు. రైతులు చట్ట విరుద్ధంగా వ్యవహరించడం లేదని, ప్రభుత్వమే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు.

రైతు పోరాటం వీధి పోరాటం కాదు, చట్టబద్ధమైన పోరాట మన్నారు. 90శాతం మంది రైతులు అంగీకరిస్తేనే ప్రభుత్వం రైతుల నుండి భూమిని తీసుకోవాలని చట్టంలో వుందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అలైన్మెంట్ మార్పు విషయంలో చొరవ తీసుకొని రైతులకు న్యాయం చేయాలని అన్నారు.

రైతు పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. రైతును చిన్నచూపు చూస్తున్నారాని. పోలీసులతో ఇబ్బంది పెడితే ఖమ్మంను స్తంభింప చేస్తామని హెచ్చరించారు. పోరాడితేనే మన భూములు మనకు మిగులుతాయన్నారు. వద్దన్న చోట రోడ్లు వేస్తున్నారు.

కావాలన్న రోడ్లు వేయడం లేదన్నారు. పోరాటాల పురిటి గడ్డ ఖమ్మంలో రైతుల జోలికొస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఖమ్మం పౌరుషం చూపెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వల దుర్గాప్రసాద్, సిపిఐ(ఎంఎల్) ప్రజపంధా జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు, టిడిపి జిల్లా నాయకులు కొండపాల కరుణాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు మద్దతును తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాగo హేమంతరావు, సిపిఎం సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శిలు నున్నా నాగేశ్వరరావు, పోటు ప్రసాద్ తదితరులు మాట్లాడారు.

Related posts

గ్రామ పంచాయతి భవనాలు త్వరగా పూర్తి చేయాలి

Bhavani

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన గిరిజన విద్యార్థి

Bhavani

నకిరేకల్ లో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment