23.2 C
Hyderabad
May 8, 2024 00: 19 AM
Slider హైదరాబాద్

వాలెంటైన్ స్పెషల్: విధ్వంసం చేసిన ఐదుగురు అరెస్టు

cybarabad police

వాలెంటైన్స్ డే సందర్భంగా విధ్వంసం సృష్టించిన కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నాగోత్ అజయ్ సింగ్, వదిత్య అర్జున్, కొర్ర సంతోష్, గుడుపు పవన్ కుమార్, పొలారి తిరుపతి ఉన్నారు. వీరంతా బజరంగ్ దళ్ కు పని చేస్తుంటారని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.

నిన్న జరిగిన వాలెంటెన్స్ డే సందర్భంగా మాదాపూర్, ఐటీ కారిడార్ పరిసరాల్లో ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా వీరు విధ్వంసం సృష్టించినట్లు ఆరోపణ ఉంది. సుమారు 10 నుంచి 15 మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు కే పి హెచ్ బి నుంచి హైటెక్ సిటీ వెళ్లే దారిలో ద్విచక్ర వాహనాలపై వెళ్తూ వాలెంటైన్స్ డే కు  వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 గచ్చిబౌలి, కొత్తగూడా, మాదాపూర్ తదితర ప్రాంతాలలోని వాణిజ్య సముదాయాలు సముదాయాల పై దాడులకు దిగారు. దారిలో కనపడిన ఓ ఐస్ క్రీమ్ షాప్ లో విధ్వంసం సృష్టించారు. ఇనార్బిట్ మాల్, బికనీర్ వాలా, ఏబీఎన్ శరత్ మాల్ తదితర చోట్ల లో దాడులకు దిగారు. సమాచారం మేరకు పోలీసులు ఇనార్బిట్ మాల్ కి చేరుకోగానే వారు అందరూ అక్కడి నుంచి పారిపోయారు.

షాపు యాజమాన్యాల ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ లు పరిశీలించిన అనంతరం పోలీసులు ఐదుగుర్ని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related posts

కడప కేంద్ర రారాగారంలో ఖైదీలకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు బెయిల్ మంజూరు

Satyam NEWS

నక్షత్రం నిర్మాణం చూశారా..? వెల్లడించిన నాసా

Sub Editor

Leave a Comment