38.2 C
Hyderabad
May 3, 2024 22: 26 PM
Slider గుంటూరు

పోలీస్, ప్రెస్ దొంగ స్టిక్కర్లతో తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు

#arifhafeejips

పోలీస్, ప్రెస్ దొంగ స్టిక్కర్లతో తిరుగుతున్న 36 మందిపై గుంటూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. గుంటూరు అర్బన్ పోలీసులు వాహన తనిఖీల భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా వీరంతా దొరికిపోయారు.

పోలీసు శాఖ కు ఎలాంటి సంబంధం లేకపోయినా వాహనాలపై పోలీస్ స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్న 20 మంది ఈ ఆకస్మిక తనిఖీల్లో దొరికారు.

అదే విధంగా ఏ పత్రికలో లేదా ఏ మీడియా సంస్థల్లో పని చేయకుండానే ప్రెస్ స్టిక్కర్ అతికించుకుని తిరుగుతున్న 16 మందిని కూడా పోలీసులు పట్టుకున్నారు.

ప్రతిరోజు యధావిధిగా అర్బన్ ట్రాఫిక్, లా & ఆర్డర్  పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తారని ఈ తనిఖీల్లో ఎవరైనా పోలీస్, ప్రెస్ కి  సంబంధం లేకుండా  తమ వాహనంపై అనవసరంగా అలా  రాసుకుని తిరిగితే పట్టుకుంటామని  అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలియజేశారు.

Related posts

కంటివెలుగు కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు

Bhavani

కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సిఐఎస్ఎఫ్) పాసింగ్ పరేడ్

Satyam NEWS

మతం మారిన వారికి ఎస్ సి పథకాలు వర్తించవు

Satyam NEWS

Leave a Comment