27.7 C
Hyderabad
May 4, 2024 07: 16 AM
Slider అనంతపురం

చిరంజీవి ఫ్యాన్స్ ను చితక్కొట్టిన అనంతపురం పోలీసులు

#ananthapurampolice

చిరంజీవి అభిమానులను అనంతపురం పోలీసులు చితక్కొట్టారు. అనంతపురంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ప్రీరిలీజ్ కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చారు. అనంతపురం మొత్తం చిరంజీవి అభిమానులతో జనసంద్రంగా మారింది.

అయితే కార్యక్రమం ఏర్పాటు చేసిన గ్రౌండ్ సామర్ధ్యం కేవలం 30 వేల మంది మాత్రమే. అయితే నిర్వాహకులు 50 వేల పాసులు ఇవ్వడంతో తొక్కిసలాట జరిగింది. వీఐపీ గ్యాలరీ పైపునకు పెద్ద ఎత్తున చిరంజీవి ఫ్యాన్స్ దూసుకు రావడంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. పోలీసులు అక్కడి వారిని చెదరగొట్టే క్రమంలో పలువురికి గాయాలయ్యాయి.

Related posts

పటిష్టమైన తుది ఓటరు జాబితాను రూపొందించాలి

Satyam NEWS

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఒక మోస్తరు వర్షాలు

Satyam NEWS

విలీనం అవసరం లేదు చర్చలకు పిలవండి

Satyam NEWS

Leave a Comment