29.7 C
Hyderabad
May 2, 2024 05: 36 AM
Slider మహబూబ్ నగర్

పటిష్టమైన తుది ఓటరు జాబితాను రూపొందించాలి

#voter

ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాల ద్వారా పటిష్టమైన తుది ఓటరు జాబితాను రూపొందిచాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకుని నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం ఊట్కూరు మక్తల్ మాగనూరు మండలాలలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం పోలింగ్ స్టేషన్లో జరుగుతుండగా కలెక్టర్ తనిఖీ చేశారు. వడ్డేవాడు జడ్పిహెచ్ఎస్ మాగనూరులలో పోలింగ్ స్టేషన్ 102, 103, 104 తనిఖీ చేశారు.

కొత్త ఓటర్ల నమోదు ఎన్ని జరిగాయని ఇన్చార్జి ఎమ్మార్వో అమీర్ ను అడిగారు. డబుల్ ఎంట్రీ ఉంటే ఓటర్ జాబితా పరిశీలించి ఇంటి సర్వేకు వెళ్లి తొలగించాలన్నారు. అనంతరం దాసరి దొడ్డి, మాగనూరు ఇసుక రీచ్ ను కలెక్టర్ పరిశీలించారు. రోజుకు ఎన్ని ట్రాక్టర్లు ఆన్లైన్లో బుక్ చేసి తరలిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రసీదులను పరిశీలించారు. కస్తూరిబా గాంధీ బాలికల రెసిడెన్ షియల్ స్కూల్ ని తనిఖీ చేసినారు. అనంతరం పి హెచ్ సి తనిఖీ చేసి ల్యాబ్ రూమ్ ని తనిఖీ చేసినారు . సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు

ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య గురించి అందుతున్న వైద్య సేవలు గురించి తెలుసుకున్నారు. ఇటీవల కాన్పులు తక్కువగా జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు పెంచేలా కృషి చేయాలని ఇన్చార్జ్ డిఎంహెచ్వో డాక్టర్ శైలజకు ఆదేశించారు. మక్తల్ ఎం పి హెచ్ ఎస్ స్కూల్లో పోలింగ్ స్టేషన్ 169,170,171 పోలింగ్ స్టేషన్లో ఎన్ని హారాలు పెండింగ్ లో ఉన్నాయని అడిగారు. కొత్త ఓటర్లు ఎంతమంది చేరారు వారిని వివరాలను తీసుకుని ఆన్లైన్లో పంపాలన్నారు.

ఇంకా ఎవరైనా కొత్తవారు ఉంటే ఈ సోమవారం వరకు దరఖాస్తులు తీసుకొని ఆన్లైన్లో యాప్ ద్వారా నమోదు చేయాలన్నారు. ఎవరైనా మరణిస్తే వారి డెత్ సర్టిఫికెట్ తీసుకొని తొలగించాలని తాసిల్దార్ సువర్ణ రాజుకు ఆదేశించారు. అలాగే సిపిఎస్ స్కూల్ మక్తల్ పోలింగ్ స్టేషన్ 162 లో జడ్పీహెచ్ఎస్ పోలింగ్ స్టేషన్ 161 లో బిఎల్ఓ లను అడిగి ఎంతమంది ఓటర్లుగా నమోదయ్యారని తెలుసుకున్నారు. ఓటర్ జాబితాలో ఉన్న ప్రకారం ఎవరైనా మరణిస్తే వారి డెత్ సర్టిఫికెట్ తీసుకొని అట్టి ఓటర్ ను తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, ఎంపీఓ, బిఎల్ఓ లు పాల్గొన్నారు.

Related posts

కేజీబీవీ ఇంటర్మీడియట్ కళాశాల అధ్యాపకుల ఆకలికేకలు

Satyam NEWS

బీజేపీకి కౌంటర్ సిద్ధం చేసుకుంటున్న కేసీఆర్

Satyam NEWS

మానసిక వికలాంగుల పట్ల సమాజానికి బాధ్యత ఉంది

Satyam NEWS

Leave a Comment