37.2 C
Hyderabad
May 6, 2024 13: 02 PM
Slider ముఖ్యంశాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఒక మోస్తరు వర్షాలు

#rains

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాగల 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో ప్రవేశిస్తాయి.

22న ఉత్తర అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది.

24న ఇది మరింత బలపడి తుపానుగా మారవచ్చు.

దీని ప్రభావంతో ఏపీలో రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్రలో నేడు ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.

శనివారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు మోస్తరు వర్షాలు పడే అవకాశముంది.

రాయలసీమలో శుక్ర, శనివారాల్లో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Related posts

ఛాలెంజ్: అక్రమ కట్టడాలు కూలగొట్టి నిజాయితీ నిరూపించుకో

Satyam NEWS

ఉజ్వల గ్యాస్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

మూడు రోజుల కిందట మిస్సయిన నవ్య నేడు శవంగా కనిపించింది

Satyam NEWS

Leave a Comment