38.2 C
Hyderabad
May 3, 2024 22: 23 PM
Slider ఖమ్మం

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ సేవలు అభినందనీయం..

#Minister Puvvada Ajay Kumar

ఖమ్మం జిల్లాలో ఎక్కడ ఎలాంటి దుర్ఘటనలు లేకుండా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.ఖమ్మం జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిష్నరేట్ నందు నూతనంగా ఎర్పాటు చేసిన 50 అడుగుల జాతీయ జెండాతో కూడిన హై మాస్ట్ ఫ్లాగ్ పోల్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.

జిల్లా పోలీస్ కమిషనరేట్ అవరణంలో ఎర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పోలీస్ శాఖ అధ్వర్యంలో National Informatics Centre DIO రూపొందించిన ఖమ్మం పోలీస్ కమిషనరేట్ వెబ్ సైట్ ను ప్రారంభించారు. అనంతరం ఇటీవలే మున్నేరు వరదల్లో ప్రమాద స్థాయిలో పని చేసి ప్రాణాలకు తెగించి పౌరులను కాపాడిన ఉత్తమ పోలీస్ సిబ్బంది 30 మందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూఇది పోలీస్ కమిషనరేట్ భవనం మాత్రమే కాదని.. జిల్లా శాంతి భద్రతలకు చిహ్నం అని అన్నారు. సుదూరం నుండి చూడగలిగే జాతీయ జెండా, భారతదేశపు ప్రతి పౌరుడిని గర్వపడేలా చేస్తుందన్నారు. ఒక నాడు ఇది కమాండ్ కంట్రోల్ భవనంగా ఉన్న దాన్ని నాడు ఎమ్మేల్యేగా ఉన్న సమయంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఅర్ అరు పోలీస్ కమిషనరేట్ లుగా చేస్తూ బిల్లు పెట్టే క్రమంలో ఖమ్మం ను కూడా కమిషనరేట్ హోదా కల్పించాలని చేసిన విజ్ఞప్తి మెరకు సానుకూలంగా స్పందించి కేసీఅర్ ఖమ్మంను కూడా కమిషనరేట్ బిల్లులో ఖమ్మంను చేర్చి 7వ

పోలీస్ కమిషనరేట్ గా బిల్లులో పేట్టి ఆమోదించారని అన్నారు. ఇది కేవలం బిల్డింగ్ మాత్రమే కాదని పౌరులకు సామాజిక భద్రత కల్పించే భరోసా కేంద్రం అని స్పష్టం చేశారు.ఖమ్మం జిల్లాలో అనేక సందర్భాల్లో పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు అభినందనీయం అని, జిల్లా వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రజలకు భద్రత, భరోసా కల్పిస్తూ మంచి జీవన విధానంకు కృషి చేస్తున్న పోలీస్ శాఖను అభినందిస్తునని చెప్పారు.

ముఖ్యంగా కోవిడ్ సమయాల్లో పోలీస్ సేవలు ప్రజలు ఎప్పుడూ మరిచిపోలేరని కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు చేసిన సహాయక చర్యలు, భద్రత చర్యలు అభినందనీయం అన్నారు.మున్నేరు ముంపు ప్రాంతంలో నిర్విరామ సేవలు అందించి ఒక్క ప్రాణం కూడా పోకుండా ప్రతి ఒక్కరిని క్షేమంగా సురక్షిత స్థానాలకు తరలించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

ఇటీవలే చిమలపాడు గ్రామంలో జరిగిన ఘటనలో ప్రజలు భయబ్రాంతులకు గురి కాకుండా పోలీస్ వ్యవస్థ పటిష్ట సేవలు అందించారని, దురదృష్టవశాత్తు నవీన్ అనే హెడ్ కానిస్టేబుల్ కాలు కోల్పోవడం బాధాకరమని, వారి ధైర్య సహసానికి సెల్యూట్ చేస్తున్నామన్నారు.

Related posts

నవంబర్ నెలాఖరు లోగా పోడు భూముల సర్వే పూర్తి

Murali Krishna

ఉన్నతమైన ఆశయం, దృఢ సంకల్పంతో దేన్నైనా సాధించవచ్చు

Bhavani

ఎంపి రఘురామ అరెస్టు అప్రజాస్వామికం

Satyam NEWS

Leave a Comment