28.2 C
Hyderabad
May 9, 2024 00: 47 AM
Slider మహబూబ్ నగర్

ఎన్నికల డ్యూటీపై పోలీస్ అధికారులకు శిక్షణ

#wanaparthypolice

వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించే పోలీసు కారులకు ఎస్పీ కె రక్షితమూర్తి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల నిబంధనలను పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉండాలని కోరారు. ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించే వారిపై నిఘా ఉంచాలని సమస్యలు సృష్టిస్తే వారిని బైండోవర్ చేయాలని ఆదేశించారు. వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు నాలుగు చెక్పోస్టులు బుద్ధారం గండి, మోజర్ల గేట్, నాగర్ కడుమూర్, రంగాపూర్ దగ్గర పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో వనపర్తి డిఎస్పి ఆనంద్ రెడ్డి సీఐలు ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

గవర్నరు కోటాలో నియమితులైన ఇద్దరు ఎంఎల్సీల ప్రమాణ స్వీకారం

Bhavani

దుబ్బాకలో ట్రబుల్ మేకర్లను బైండోవర్ చేయండి

Satyam NEWS

తిరుప‌తిలో వైకుంఠ ఏకాద‌శికి విశేషంగా ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment