34.7 C
Hyderabad
May 5, 2024 01: 04 AM
Slider ప్రపంచం

నేపాల్ లో రాజకీయ ప్రతిష్టంభన

#nepal

నేపాల్ రాజకీయాలు ఆదివారం నాటకీయ మలుపు తిరిగాయి. ప్రధాన మంత్రి మరియు నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా, CPN-మావోయిస్ట్ సెంటర్ అధ్యక్షుడు పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ ప్రధానమంత్రి పదవిపై ఏకీభవించకపోవటంతో ఇక్కడ పాలక కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. రెండున్నరేండ్ల పాటు అధికారాన్ని పంచుకునేందుకు ప్రచండ పార్టీ తెచ్చిన ప్రతిపాదనను సీపీఎన్‌ వ్యతిరేకిస్తుండటంతో సమస్య మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తున్నది.

తామే ముందుగా అధికారం చేపడతామని సీపీఎన్‌ ఒత్తిడి తీసుకువస్తున్నది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఆదివారం కల్లా ఓ నిర్ణయం తీసుకోవాలని నేపాల్‌ ప్రెసిడెంట్‌ విద్యాదేవి భండారీ అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. అధికార పీఠం కోసం ఆరు పార్టీల కూటమిలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. తాము ముందంటే తామంటూ ప్రచండ పార్టీ, సీపీఎన్‌ పార్టీ పట్టుబట్టడంతో ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. రెండున్నరేండ్ల చొప్పున అధికారాన్ని పంచుకునేందుకు ప్రచండ పార్టీ ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.

తమ పార్టీ తరఫున ప్రచండ ప్రధాని అవుతారని కూడా ఆయన పార్టీ ప్రకంటించింది. అయితే ప్రచండ పార్టీ ప్రతిపాదనను సీపీఎన్‌ పార్టీ పక్కన పెట్టింది. ముందుగా తామే అధికారం చేపడతామంటూ కొర్రీ పెట్టింది. ప్రచండ ప్రతిపాదన భేషుగ్గానే ఉందని మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. ముందుగా రెండున్నరేండ్లు అధికారంలో ఉన్న తర్వాత ఏదో ఒక సాకు చూపి తన మద్దతును ఉపసంహరించుకుంటే ఎలా అని నేపాలీ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది.

నేపాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నేపాల్‌ కాంగ్రెస్‌-సీపీఎన్‌ మావోయిస్టులు సిద్ధమయ్యాయి. తొలుత రెండున్నరేండ్ల పాటు ప్రచండ ప్రధానిగా కొనసాగుతారని నేపాల్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధాని పదవికి స్వతంత్ర ఎంపీలతో సహా 169 మంది ఎంపీల మద్దతు ఉందని దహల్ నేపాల్ అధ్యక్షుడికి రాసిన లేఖలో పేర్కొన్నారు. దీని తర్వాత రాష్ట్రపతి బిద్యా దేవి భండారీ నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ను నియమించారు.

వాస్తవానికి ఆదివారం నాడు అధికార కూటమి కీలక సమావేశం జరిగింది. ఇందులో తాత్కాలిక సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన నాలుగు పార్టీలు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఒక అంగీకారానికి రావాల్సి ఉండగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ప్రధానమంత్రి పదవికి సంబంధించి ప్రధాని దేవుబా మరియు పుష్ప కమల్ దహల్ మధ్య ఒప్పందం కుదరలేదు.

కాగా, మాజీ ప్రధాని ప్రచండ అధికార కూటమితో తెగతెంపులు చేసుకున్నారు. ఈ తర్వాత పుష్ప్ కమల్ దహల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ జరిగిన ఒక ముఖ్యమైన సమావేశంలో, ఓలి నేతృత్వంలోని ప్రతిపక్ష CPN-UML, CPN-మావోయిస్ట్ సెంటర్, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) మరియు ఇతర చిన్న పార్టీలు ప్రచండ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించాయి. CPN-UML, CPN-MC మరియు ఇతర పార్టీలు రాష్ట్రపతి కార్యాలయం శీతల్ నివాస్‌లో 165 మంది ఎంపీల సంతకాలతో ప్రచండ ప్రధాని కావడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(2) కింద దావాను సమర్పించాయి.

ఈ విషయాన్ని CPN-MC ప్రధాన కార్యదర్శి దేబ్ గురుంగ్ ధృవీకరించారు. ప్రచండ తర్వాత సీపీఎన్‌-యూఎంఎల్‌ పార్టీ అధికారం చేపడుతుంది. అంటే మాజీ ప్రధాని ఓలీ మరోసారి ప్రధాని అవుతారన్నమాట. ఇదిలా ఉండగా, ఆదివారం నాటు అధికార మావోయిస్టు కేంద్రానికి మద్దతు ఇచ్చేందుకు ప్రచండ నిరాకరించారు. కూటమిని విడిచిపెట్టిన విషయాన్ని నేపాల్ కాంగ్రెస్ సీనియర్ నేత రామచంద్ర పాడెల్ ధ్రువీకరించారు.

నేపాల్ ప్రెసిడెంట్‌ సూచించినట్లుగా ఆదివారంలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు పార్టీలు చర్యలు తీసుకోని పక్షంలో అతి పెద్ద పార్టీ నాయకుడిని ప్రధానిగా రాష్ట్రపతి నియమించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం నెల రోజుల్లోగా తమ మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మెజార్టీ నిరూపించుకోని పక్షంలో తిరిగి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

Related posts

తెలంగాణకు హరితహారం అద్భుతమైన కార్యక్రమం

Satyam NEWS

తిరుమ‌ల‌లో జ‌న‌వ‌రి 22వ తేదీ వ‌ర‌కు సిఫార్సు లేఖ‌లు బంద్

Satyam NEWS

గణపసముద్రం చెరువులో మంచినీటి రొయ్యల విడుదల

Satyam NEWS

Leave a Comment