33.7 C
Hyderabad
April 30, 2024 01: 39 AM
Slider విజయనగరం

చంద్రబాబు వ్యాఖ్యలకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కౌంటర్ ఎటాక్

#counter

మంత్రి బొత్స సత్యనారాయణ, తాను రానున్న ఎన్నికల్లో ఓటమి ఖాయమని ప్రకటనలు చేస్తున్న  చంద్రబాబు నాయుడు, కుప్పంలో గెలుస్తానని  చంద్రబాబు ధైర్యంగా చెప్పగలరా అని ఏపీ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రశ్నించారు.  తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజులుగా చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించి  ఏం సాధించారని అన్నారు.

ఎన్నికలు వస్తే మేము గెలుస్తామో లేదో గాని కుప్పంలో నువ్వు గెలుస్తావో, లేదో  చూసుకో అని అన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలపై ఏనాడైనా ఇంటింటికి వెళ్లి పథకాలు అందుతున్నాయా అని అడిగారా అని ప్రశ్నించారు. మేము గడపగడపకు కార్యక్రమం ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడుగుతూ ఉంటే ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని అన్నారు.

కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా అర్హులకు పథకాలు నేరుగా అందిస్తూ, అవినీతి లేని ప్రచారంజకపాలన సీఎం జగన్ కొనసాగిస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ ను పదవిచ్చుతుని చేయడానికి, మరణానికి అశోక్ బంగ్లాలో స్కెచ్ వేసిన చంద్రబాబు నాయుడు, నేడు మళ్లీ ఎలాంటి అరాచకాలు, అకృత్యాలు చేయడానికి  అశోక్ బంగ్లాలో  మకాం  వేశారా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు.

విజయనగరంలో జరిగిన పర్యటన విజయవంతమైన గొప్పలు చెప్పుకుంటున్నారని, చంద్రబాబు విజయనగరం పర్యటనకు మహిళలు ఎక్కడ కాన రాలేదని, మూడు నాలుగు నియోజకవర్గాల నుంచి  చంద్రబాబు సభకు  ప్రజలను తరలించిన మాట వాస్తవం కాదా అని అన్నారు. ఇసుక దొరకడం లేదని చంద్రబాబు విమర్శిస్తున్నారని, బ్లాక్ మార్కెట్లో దొరకదు కానీ ప్రభుత్వమే నేరుగా ఆన్లైన్ విధానం ద్వారా ప్రజలకు ఇసుక  అందిస్తోందని  అన్నారు.

జన్మభూమి కమిటీల ద్వారా అవినీతికి పాల్పడబట్టే 2019 ఎన్నికలలో ప్రజలు చంద్రబాబుని ఇంటికి పంపారు అన్న వాస్తవాన్ని చంద్రబాబు గ్రహించాలని అన్నారు. చంద్రబాబు అవాస్తవ మాటలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. దిశా చట్టం ద్వారా మహిళలపై అఘాయిత్యాలు జరక్కుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశా చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు.

విశాఖలో పరిపాలన రాజధాని వద్దని చెబుతున్న చంద్రబాబు, అదే జరిగితే రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందుతుందోనని, ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని అక్కస్సుతో వాస్తవాలను వక్రీకరించి చంద్రబాబు మాట్లాడుతున్నారని అన్నారు. తాను భూ కబ్జాలకు పాల్పడుతున్నానని చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారని, ఆయనకు దమ్ముంటే నేను భూకబ్జాలకు పాల్పడిన స్థలాలకు   అశోక్ గజపతిరాజును  పంపించి వాస్తవాలు బయటకు తీసుకురావాలని అన్నారు.

తన 38 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు అవినీతికి పాటుపడలేదని అన్నారు.  చంద్రబాబు తన ప్రభుత్వ హయాములో విజయనగరానికి ఏం చేశారని ప్రశ్నించారు. హైదరాబాదు మకాంలో ఉన్న చంద్రబాబు ఆంధ్రాలో పరిస్థితి తెలిసి, తెలంగాణలోని తన ఉనికిని చెప్పుకోవడానికి ఖమ్మంలో సభను ఏర్పాటు చేయడం నిజం కాదా అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన నిరుపేదలకు 30 లక్షల పట్టాలు ఇచ్చి, ఇసుక సిమెంట్ తో పాటు, 1,80,000  గృహ లబ్ధిదారులకు ప్రభుత్వం ఇస్తూ ఉంటే చంద్రబాబు కంటికి కనబడదా అని అన్నారు.

చంద్రబాబు నాయుడు మెదడుకు, నాలుకకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరిగితే ప్రస్తుతం ఉన్న 23 సీట్లు కూడా రావని గ్రహించిన చంద్రబాబు ప్రజలకు లేనిపోని మాటలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో చంద్రబాబు నాయుడు హైదరాబాదులో ఉంటే, అశోక్ గజపతిరాజు తన బంగ్లాకు తాళాలు వేసుకుని, ఎవరు రావద్దని చెప్పడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉంటూ వైద్య సేవలు అందిస్తూ భరోసా కల్పించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే అని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల అన్నారు.

Related posts

జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర

Bhavani

జనతా కర్ఫ్యూ: నేను ఇంట్లోనే ఉన్నాను మీరూ ఉండండి

Satyam NEWS

గురుకులాలకు శాశ్వత భవనాలను మంజూరు చేయాలి

Murali Krishna

Leave a Comment