37.2 C
Hyderabad
May 2, 2024 14: 10 PM
Slider ముఖ్యంశాలు

లెక్కలతో రాజకీయ ఐఖ్యత సాధ్యం కాదు

#CPI

లెక్కలతో రాజకీయ ఐఖ్యత సాధ్యం కాదని, పరస్పర సహకారం అన్నింటికీ మించి అవగాహన ముఖ్యమని సిపిఐ జాతీయ కార్యదర్శి డా.కే. నారాయణ తెలిపారు. వికీపీకి వ్యతిరేకంగా పోరాడే క్రమంలోనే బిఆర్ఎస్ కు మద్దతు పలికామని, ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత కేసిఆరే అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ప్రజాగర్జన

పేరిట భారీ బహిరంగ సభ జరిగింది. సభా ప్రాంగణమైన ప్రకాశం స్టేడియం జనంతో కిక్కిరిసి పోయింది. ఎటు చూసినా జనమే కనిపించారు. కొత్తగూడెం పురవీధులు అరుణ నిర్గాన్ని సంతరించుకున్నాయి. సిపిఐ జిందాబాద్ నినాదాలతో మార్మోగింది. సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన సభలో నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర

సాధనలో సిపిఐ వీరోచిత పాత్ర పోషించిందన్నారు. సిపిఐ తెలంగాణసాయుధ పోరాటం లేకుండా అసలు తెలంగాణ ప్రాంతం దేశంలో ఉండేది కాదని, సిపిఐ మద్దతు లేకుండా తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదని నారాయణ.

తెలిపారు. కేసిఆర్ తెలివిగల వాడే కానీ, అతి తెలివి ప్రదర్శస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. దళితబందు తీరు ఊరికో కోటి, ఇంటికో ఈక మాదిరిగా మారిందని, దళితులకు మూడెకరాల భూమి సంగతి అసలే మర్చిపోయారని

తెలిపారు. 11 లక్షల ఎకరాలు పోడుభూములకు పట్టాలివ్వాల్సి ఉండగా, ఇప్పుడు కేవలం 4వేల ఎకరాలకే ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సిపిఐ ఎన్నికల కోసమే సభ ఏర్పాటు చేసిందని అంటున్నారని, ఎన్నికల్లోకి

పోకుండా ఉండేందుకు తామేమి సన్యాసం తీసుకోలేవన్నారు. సీట్లు అడగడం తమ రాజకీయ హక్కని నారాయణ స్పష్టం చేశారు. విజేపీ విధానాలు ప్రాంతానికో తీరుగా ఉంటాయని, బిజేపికి కట్టుబానిసగా ఉన్న జగన్ ను ఇప్పుడు ఎందుకు తిట్టిపోస్తున్నారో అర్ధం కావడంలేదన్నారు. విజేపి ప్యాములు ఉన్నాయని, రాజధాని లేదని, దోచుకుంటున్నారని అవడం

ఆశ్చర్యంగా ఉందన్నారు. కర్నాటకలో సందుల్లో గొందుల్లో బిజేపీ నేతల తిరిగినప్పటికీ ఫలితం రాలేదని, ఇప్పుడు మోడి, అమీ, నడ్డా తెలంగాణ చుట్టు తిరుగుతున్నారని, తెలంగాణలో బిజేపికి అంత సీన్ లేదన్నారు. రాజ్యాంగ సంస్థ అయిన సిబిఐ, ఇడి లను పెంపుడు కుక్కలగా మార్చేసిందని, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని, కేసిఆర్ సహా

ఎవరైనా లొంగితే మరింతగా ఒత్తిడి పెంచుతుందని నారాయణ తెలిపారు. 2014 లో రూ.400 గ్యాస్ ధర ఉంటే, గ్యాస్ బండ చూసి మహిళలు తనకు ఓటేయాలని చెప్పిన నూడి. ఇప్పుడు రూ.3150 ధర పెరిగిందని, దీనికి మోడి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పప్పు, ఉప్పు, మెరపకాయలతో సహా నిత్యవసరాల ధరలు భారీగా పెరిగాయని, ఇది మోడి

ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. సంపన్న వర్గాల వారికి 32 శాతం నుండి 21 శాతానికి పన్ను తగ్గించి, పేదల నుంచి రూ.1.5M లక్షల కోట్లు జిఎస్టి పేరుతో దోచుకున్నారని నారాయణ తెలిపారు. ఆధాని మోది కవల పిల్లలని, వీరద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డాడు. దత్తపుత్రులకు దేశం సంపదను కారు చౌకగా కట్టబెట్టేందుకే ప్రధాని పదవి

తీసుకున్నారని నారాయణ ఆరోపించారు. మోడితో రాజ్యాంగానికి అత్యంత ప్రమాదం. పొందుందని, నుంత్రి వర్గంలో 24 మంది నేరస్తులు ఉన్నారని తెలిపారు.మోడీ రాష్ట్రపతిని పిలువకుండా ఎందుకు పార్లమెంట్ భవనాన్ని రంభించారని, దానికి సహేతుకమైన కారణం చెప్పగలరా అని నూటి ప్రశ్న వేశారు. మోడి హాయంలో న్యాయవ్యవస్థ కుడా తన పరపతిని

కోల్పోతుందన్నారు. సాంకేతిక పరంగా సిపిఐ జాతీయ హోదాను రద్దు చేశారని, ఎలక్షన్ కమీషనర్ నియామకమే చట్ట విరుద్దమన్నారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 20 రాష్ట్రాల్లో ఉన్న సిపిఐ జాతీయ హోదా రద్దు వెనుక పెద్ద దురుద్దేశ్యం

ఉందన్నారు. తమ పోరాటాన్ని ఆపేందుకు ఎవ్వరు ప్రయత్నించినా ఫలితం ఉండదని, ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేసాడు. కొందురు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని, ఈ అవకాశ

వాదులకు బుద్ధి చెప్పాలని నారాయణ అన్నారు. ధనం బలం చూసికుని కొందరు మురిసిపోతున్నారని, ప్రజలు తగు రీతిలో వారికి సమాధానం ఇస్తారని నారాయణ స్పష్టం చేశారు.

Related posts

ఏ జిల్లా విద్యార్ధులు ఆ జిల్లాలోనే అడ్మిషన్ తీసుకోవాలి

Satyam NEWS

మున్సిపల్ వ్యర్ధాల నిర్వహణకు తమిళనాడు అధికారుల ప్రశంస

Satyam NEWS

ఒక వేణువు ఆగింది

Satyam NEWS

Leave a Comment