25.7 C
Hyderabad
May 9, 2024 09: 27 AM
Slider ముఖ్యంశాలు

కమ్యూనిస్టుల త్యాగాలతో పునీతమైన తెలంగాణ

#Telangana

పోరాటాలకు ఓనమాలు నేర్పిందే కమ్యూనిస్టులని, వారి పోరాటాలు లేకుండా ఈదేశంలో ఏసమస్య కుడా పరిష్కారం కాలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. కమ్యూనిస్టుల పోరాటాలు, త్యాగాలతో తెలంగాణ నేల పునీతమైందన్నారు. కొత్తగూడెంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగర్జన సభకు

అధ్యక్షతన వహించిన కూనంనేని మాట్లాడుతూ కమ్యూనిస్టుల సత్తా ఏమిటో ఈ బహిరంగ సభ ద్వారా నిరూపితమైందన్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా లక్ష మంది తరలివచ్చి కమ్యూనిస్టు పార్టీ ఖ్యాతిని

ఇనుమడింప జేశారన్నారు. కమ్యూనిస్టులకు విమర్శలు కొత్తేమీ కాదని, యదనిండా గాయాలతోనే కమ్యూనిస్టు పార్టీ ఎదిగిందని, ఏసి గదుల్లో కూర్చుని కొందరు కమ్యూనిస్టులను విమర్శిస్తున్నారన్నారు. కమ్యూనిస్టులు లేకుండా ఇప్పటి

తెలంగాణ సాధ్యమయ్యేదా అని, అసలువారి పోరాటమే లేకుంటే నాలుగున్నర వేల మంది అమరులు బలిదానాలు లేకుండా తెలంగాణ ఉండేదా అని ప్రశ్నించారు. దేశానికి స్వతంత్రం రాకముందే ప్రజల్లో సమానత్వాన్ని కమ్యూనిస్టులు తట్టి లేపారని, ఆ విషయాలనే బాబా సాహేబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందు పరిచారని కూనంనేని చెప్పారు.

దున్నేవానికే భూమి దక్కాలని, శ్రమకు తగ్గ ఫలితం రావాలని, రైతు, కార్మిక సంఘాలను కమ్యునిస్టులు ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. కమ్యూనిస్టులు, దళితులు, గిరిజనులు ఇతరులు అన్న కులభావం లేకుండా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారమన్నారు. వందేళ్లయినా కమ్యూనిస్టులు నవ యవ్వనంతో పోరాడుతున్నారని, కొత్తగూడెం బహిరంగ సభే

ఇందుకు సాక్షం అన్నారు. అన్ని పర్గాల తరుపున బహుముఖ పోరాటాలు చేస్తున్నామని, కమ్యూనిస్టుల రక్తంలోనే పోరాట పటిమ ఉందన్నారు. పేదలు ఉన్నంత కాలం పోరాటాలుంటాయని, నాటి భగత్ సింగ్, చేకువేరా, ఐలమ్మ, కొమరయ్య,

శేషగిరి, మొదలు నేటి త్యాగ ధనుల వరకు వారిచ్చిన స్ఫూర్తితో మరింత ముందుకు సాగుతామన్నారు. బిజేపి ముస్లీంలు మొదటి శత్రువుల అని, కమ్యునిస్టులు రెండో శత్రువులు అని, క్రిష్టియన్లు మూడో శత్రువులని ప్రచారం చేస్తోందని, కానీ కమ్యూనిస్టులకు మాత్రం తొలి నుండి తుదిదాగా బిజేపినే ప్రధమ శత్రువన్నారు. బండి సంజయ్ లాంటి వ్యక్తులు

సిగ్గులేకుండా ఉపన్యాసాలు చేస్తున్నారని, అవకాశ వాద రాజకీయాలకు ఆయన పెట్టింది పేరన్నారు. పార్టీలు మారే అడ్డమైన గాడిదలు కమ్యూనిస్టులకు నీతులు చెబుతున్నారని, విమర్శించడం ఒక ఫ్యాషన్ మారిందన్నారు. హిందూ మతాన్ని రక్షిస్తున్నట్లు నటిస్తూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. బిజేపి పుట్టుకకు ముందే ధర్మం పుట్టిందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పరిష్కారం కాని సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలన్నారు. అర్హత గల ప్రతీ పోడురైతుకు పట్టా ఇవ్వాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సింగరేణి ప్రైవేటీ కరణను నిలుపుదల చేయాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. రైతు రుణ మాఫీని అమలు చేయాలని, సొంత స్థలాల్లో ఇంటి నిర్మాణానికి

రూ.10 లక్షలు కేటాయించాలని, నిరుద్యోగ బృతిని అమలు చేయాలని చెప్పారు. సమస్యలు పరిష్కారం కాకుంటే ప్రజాపోరాటాలు తప్పవన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ బిజేపి విధానాలను ఎండగట్టడం కమ్యూనిస్టులకు అవసరమని, బిజేపి దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ దేశాన్ని నాశనం

చేసేందుకు సంసిద్దమవుతోందని, ఈ సమయంలో కమ్యునిస్టులుగా మతోన్మాదాన్ని అపడం మన ధర్మం అని అన్నారు. కమ్యూనిస్టులుచట్ట సభల్లో ఉంటే జరిగే లాభాలు ప్రజలకు తెలుసని, గతంలో ఈ ప్రాంతం నుండి సిపిఐ ప్రాతినిధ్యం వహించిన కాలంలో బయ్యారం ఉక్కు గనిని కాపాడిందని చెప్పారు. ఈ ప్రాంతం నుండి అనేక మంది కమ్యూనిస్టులు

ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేశారన్నారు. ఆ నాటి సాయుధ పోరాటం, తర్వాత కమ్యూనిస్టుల పోరాట ఫలితమే నేటి తెలంగాణ అని చెప్పారు. తెలంగాణ గడ్డ మీద బిజేపికి ఓటు అడిగే హక్కులేదని చెప్పారు.

Related posts

ఘనంగా సోనియాగాంధీ జన్మదిన కార్యక్రమం

Bhavani

సస్పెన్స్:అమ్మాయి వెన్నెముకలో బుల్లెట్

Satyam NEWS

టూరిజం ప్రాంతాల్లో గో ఉత్పత్తుల విక్రయానికి స్టాల్స్ ఇప్పించాలి

Satyam NEWS

Leave a Comment