29.7 C
Hyderabad
May 4, 2024 04: 29 AM
Slider పశ్చిమగోదావరి

అత్యాచారయత్నం నిందితుడిని కాపాడే యత్నం?

model rape

ఒక బాలికపై అత్యాచారయత్నం చేసిన వాడిని శిక్షిస్తారా? లేక ఆ కుటుంబంతో రాజీ చేస్తారా? బుద్ధి ఉన్నవాడెవడైనా వాడికి శిక్ష పడే విధంగానే ప్రయత్నిస్తారు.

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లిన ఒక బాలిక దగ్గరకు వెళ్లిన 18 ఏళ్ల రాకేష్ మాయమాటలు చెప్పి ఆ బాలికను నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లాడు.

గ్రామ సమీపం లో ఉన్న అటవీ ప్రాంతానికి బండి మీద ఎక్కించుకుని సుమారు 2 కిలోమీటర్లు తీసుకువెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. బాలిక భయపడి గట్టిగా అరచి కేకలు వేయడంతో, నిందితుడు రాకేష్ కూడా భయ పడి ఆ బాలికను స్కూలుకు తీసుకువచ్చి వదిలి వెళ్ళిపోయాడు. ఈ విషయం బాలిక చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు పెదవేగి పోలీసులకు పిర్యాదు చేసారు.

పోలీసులు కేసు నమోదు చేసేలోగా గ్రామానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు ఇందులో జోక్యం చేసుకున్నాడు. నిందితుడు నుండి 10 వేలు నష్ట పరిహారం ఇప్పిస్తానని చెబుతూ కేసు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

దీనిపై పెదవేగి ఎస్ ఐ సుధీర్ ను వివరణ కోరగా రాకేష్ అనే వ్యక్తి బాలికకు మాయ మాటలు చెప్పి బయటకు తీసుకెళ్లి భయపడి బాలికను క్షేమంగా పాఠశాలకు ద్విచక్ర వాహనంపై తీసుకు వచ్చి దింపి వెళ్లిపోయాడని విచారణలో తెలిసిందని చెప్పారు. నిందితుడు రాకేష్ పై కేసు నమోదు చేశామని ఎస్ ఐ సుధీర్ గురువారం తెలిపారు.

Related posts

ములుగు జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు చేయాలి

Satyam NEWS

ఆధునిక టెక్నాలజీని విద్యార్ధులు వినియోగించుకోవాలి

Bhavani

సంహారి మొదటి ప్రచార చిత్రం విడుదల చేసిన శంకర్

Satyam NEWS

Leave a Comment