38.2 C
Hyderabad
May 2, 2024 22: 42 PM
Slider ప్రత్యేకం

గిరిపుత్రులతో విజయనగరం ఎస్పీ దీపిక మమేకం…

#vijayanagaramsp

విజయనగరం జిల్లా కు నాలుగు నెలల క్రితం వచ్చిన ఎస్పీ దీపికా పాటిల్ పాత ఎస్పీ రాజకుమారి బాటలోనే వెళుతున్నారు. అందుకు నిదర్శనమే తాజాగా గిరిపుత్రులతో మమేకం అవ్వడం. విజయనగరం జిల్లా మక్కువ మండలం గిరి శిఖర గ్రామమైన దిగువ మెండంగిలో జిల్లా పోలీసుశాఖ ఆధ్యర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ మెగా వైద్య శిబిరానికి విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక, ముఖ్య అతిధిగా హాజరై, ఉచిత వైద్య, కంటి వైద్య శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దీపిక మాట్లాడుతూ – పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు స్నేహితులేనన్నారు. పోలీసులను చూసి ప్రజలెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, కేవలం నేరస్థులు మాత్రమే పోలీసులంటే భయపడాలన్నారు.

పోలీసుశాఖ ఇప్పటికే స్థానిక ప్రజల సహకారంతో గిరిజన ప్రాంతాలలో శ్రమదానంతో రోడ్లు నిర్మించామన్నారు. యువత అందరూ బాగా చదువుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వ ఉద్యోగాల సాధించాలన్నారు.

అందుకు అవసరమైన శిక్షణ, సౌకర్యాలను పోలీసుశాఖ కల్పిస్తుందన్న భరోసాను గిరిజన యువతకు జిల్లా ఎస్పీ కల్పించారు. పోలీసు, సీఆర్ పీఎఫ్ ఉద్యోగాల ఎంపికకు హజరయ్యేవారికి శారీరక, వ్రాత పరీక్షకు ప్రత్యేక శిక్షణ ఏర్పాట్లును ఐటీడీఏ సహకారంతో చేపడతామన్నారు. నేడు ప్రతీ గ్రామంలో ఒక మహిళా పోలీసు ఉద్యోగి ఉన్నారని, వారి సహకారంతో తమ సమస్యలను స్థానిక పోలీసుల దృష్టికి తీసుకొని వస్తే, వాటి పరిష్కారానికి ఇతర శాఖల సహకారంతో చర్యలు చేపడతామన్నారు.

ఇటీవల కాలంలో వర్షాలు ఎక్కువగా పడిన కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఈ గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి సాధారణ వ్యాధులతోపాటు, కంటి సమస్యలను పరిష్కరించేందుకు నిపుణులైన వైద్యుల సహకారంతో చర్యలు చేపట్టామన్నారు.

గిరిజన ప్రాంతాల్లో నివసించే గిరిజనులు సమతుల్య ఆహారం తీసుకోక పోవడం వలన చిన్న వయస్సులోనే కళ్ళ సమస్యలతో బాధపడుతున్నట్లుగా గుర్తించామన్నారు. అదే విధంగా సీజనల్వ్యా ధులైన జ్వరం, డయేరియా, కాళ్ళ నొప్పులు ఇతర వ్యాధులకు చికిత్స అందించాలనే లక్ష్యంతో ఈ మెగా వైద్య శిబిరంను నిర్వహించామన్నారు.

ఈ వైద్య శిబిరాలకు దిగువ మెండంగి, చిలక మెండంగి, బండ మెండంగి, అలగురువు, మూలవలస చుటుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 500మంది గిరిపుత్రులు హాజరై, వైద్య పరీక్షలు చేయించుకోగా, వారికి ఉచితంగా మందులను పంపిణీ చేసారు.

ఈ వైద్య శిబిరంలో స్వచ్ఛందంగా పాల్గొని వైద్య సేవలందించిన వైద్యులకు, ఇతర సిబ్బందికి జిల్లా పోలీసుశాఖ తరుపున కృతజ్ఞలు తెలిపి, వారికి జ్ఞాపికలను జిల్లా ఎస్పీ దీపిక అందజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో విజయనగరం పుష్పగిరి కంటి హాస్పిటల్ డాక్టర్లు డా. అజయ్కు మార్, డా. కీర్తన, మక్కువ పిహెచ్ సి డాక్టర్లు డా. రాజేష్, డా. త్రినాథ్ లు గిరిపుత్రులకు  వైద్య పరీక్షలు నిర్వహించారు.

గిరిజన మహిళలు జిల్లా ఎస్పీ దీపికను సాలువతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. గిరిజనులకు చీరలు, దుప్పట్లు, గొడుగులు, దోమతెరలు, స్టీలు పళ్ళాలు, గ్లాసులు పంపిణీ గిరిజన యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు చుట్టు ప్రక్కల గ్రామలకు చెందిన గిరిజన యువతకు ఉచితంగా వాలీబాల్ కిట్లను జిల్లా ఎస్పీ  దీపిక అందజేశారు.

అదే విధంగా గిరిజన మహిళలకు చీరలు, స్టీలు పళ్ళాలు, గ్లాసులు, దోమ తెరలు అందజేయగా, గిరిజనులకు దుప్పట్లు, గొడుగులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక అందజేసారు.

వైద్య శిబిరానికి హాజరైన గిరిజనులకు భోజన వసతులు

ఈ వైద్య శిబిరాలకు మక్కువ మండలం దిగువ మెండంగి, చిలక మెండంగి, బండ మెండంగి, అలగురువు, మూలవలస మరియు చుట్టు ప్రక్క గ్రామాల గిరిజనులకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో భోజన, వసతులను కల్పించారు.

ఇక జిల్లా ఎస్పీ  దీపిక గిరిపుత్రులకు స్వయంగా భోజనాలను వడ్డించి, ప్రతీ ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి, ప్రతీ ఒక్కరూ భోజనం చేసి, వెళ్ళాల్సిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో ఒఎస్ డి ఎన్. సూర్యచంద్రరావు, పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్, సాలూరు సిఐ ఎల్.అప్పల నాయుడు, ఎస్టీఎఫ్ ఆర్ ఐ మరియన్ రాజు, మక్కువ ఎస్ఐ షణ్ముఖరావు, రామభద్రపురం ఎస్ఐ కృష్ణమూర్తి, సాలూరు రూరల్ ఎస్ఐ జగదీష్ నాయుడు, ఎస్టీఎఫ్ ఆర్ఎస్ఐ లు నారాయణరావు, ప్రసాదరావు మరియు ఇతర పోలీసు సిబ్బంది సిబ్బంది, డాక్టర్స్, పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.

ఎం. భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్

Related posts

జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేశ్

Satyam NEWS

అయోధ్య కు సంఘీభావంగా స్థానిక ఆలయంలో పూజలు

Satyam NEWS

పాత్రుని వలసలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

Satyam NEWS

Leave a Comment