26.7 C
Hyderabad
May 3, 2024 10: 03 AM
Slider పశ్చిమగోదావరి

ఆధునిక టెక్నాలజీని విద్యార్ధులు వినియోగించుకోవాలి

#MLA Kotaru Abbayya

మారుతున్న నవ నాగరిక సమాజంలో ఆధునిక ఇంటర్ నెట్ టెక్నాలజీ విద్య పై విద్యార్థులు 8వ తరగతి నుండే అవగాహన పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఉచితంగా ట్యాబ్ లు అందిస్తోందని ఏలూరు జిల్లా దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్య చౌదరి అన్నారు. పెదవేగి మండలం కొప్పాక, పినకడిమి, భోగాపురం, రామచంద్రపురం, కూచింపూడి, రామసింగవరం తదితర గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్ధిని విద్యార్థులకు ఇంటర్ నెట్ ద్వారా బోధించే కొన్ని ముఖ్యమైన సబిజెక్టు లను ఆన్ లైన్ ద్వారా వినే సౌకర్యం కలిగిన ట్యాబ్ లను ఎం ఎల్ ఏ అబ్బయ్యచౌదరి పంపిణీ చేశారు.

ఆధునిక ఇంటర్నెట్ టెక్నాలజీ ని ఈ ట్యాబ్ ల ద్వారా విద్యార్థులు అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను ఎదగాలని విద్యార్థులకు ఉద్బోధించారు. ఈ ఆధునిక సమాజం లో రోజు రోజుకి కొత్త కొత్త వెర్షన్ లతో మారిపోతున్న అత్యాధునిక కంప్యూటర్ టెక్నాలజీ ని ప్రతి విద్యార్థి తెలుసుకుని అభివృద్ధి చెందాలనే లక్ష్యం తో నే ప్రభుత్వం విద్యార్థులకు ట్యాబ్ లను అందించే కార్యక్రమం చేపట్టిందని తెలిపారు.

విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆధునిక టెక్నాలజీ విద్యలో ఆణిముత్యాలుగా మెరిసి తల్లిదండ్రులకు, పాఠశాలలకు మంచిపేరు తీసుకురావాలని అన్నారు.

Related posts

వాన దీవెన!

Satyam NEWS

విద్యుత్ బిల్లు వసూలుకు వెళ్తున్న అధికారులకు చుక్కెదురు

Satyam NEWS

ఖమ్మం పోలీస్: నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

Satyam NEWS

Leave a Comment