25.2 C
Hyderabad
May 13, 2024 10: 30 AM
Slider ముఖ్యంశాలు

సాయి చంద్ భార్యకు పదవి.. ఆర్ధిక సాయం

#Sai Chand

భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ నాయకులు కుసుమ జగదీష్, సాయి చందు అకాల మరణం చెందడం సీఎం కేసీఆర్‌ను ఎంతగానో కలిచివేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకొని, వారి యోగక్షేమల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర 150 మందికి పైగా ప్రజాప్రతినిధుల ఒక నెల జీతం సుమారు మూడు కోట్లకు పైగా ఆ రెండు కుటుంబాలకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కుసుమ జగదీష్, వేద సాయి చంద్ అకాల మరణానికి సంతాపం తెలిపారు. ఇరు కుటుంబాలకు కోటిన్నర చొప్పున అందిస్తామన్నారు. కుసుమ జగదీష్, సాయి చందు తల్లిదండ్రులను కూడా పార్టీ తరఫున ఆదుకుంటామని వెల్లడించారు.

సాయిచంద్ సతీమణి రజినీకి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా ఇవ్వాలని సీఎం నిర్ణయించారని అన్నారు. ఇరు కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సహాయం ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల శ్రమ, త్యాగాల వలన పార్టీ నిర్మాణమైందన్నారు. కార్యకర్తలకు రుణపడి ఉంటామన్నారు.

Related posts

కల్వకుర్తి – మల్లెపల్లి జాతీయ రహదారిపై సమీక్ష

Satyam NEWS

ఈ నెల 10న క్యాబినెట్ భేటీ

Murali Krishna

పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment