38.2 C
Hyderabad
April 28, 2024 20: 55 PM
Slider అనంతపురం

పాపం పండింది: ఏసీబీ ఉచ్చుకు చిక్కిన ఎస్ ఆర్ ఓ మూర్తి

#SRO Murthy

అడ్డగోలుగా అక్రమార్జనకు తెగబడుతూ వచ్చిన అనంతపురం అర్బన్ సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణ మూర్తి ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖ ఉచ్చుకు చిక్కాడు. అనంతపురం రూరల్ లో ఏసీబీ వల నుంచి తప్పించుకున్న అతను అనంతపురం అర్బన్ లో తప్పించుకోలేకపోయాడు.

అవినీతి నిరోధక శాఖ అధికారులు పక్కా వ్యూహం, పకడ్బందీ ప్రణాళికను అమలు చేశారు. అనంతపురం నగరానికి చెందిన ఎం రామ్మోహన్ సోదరుడు రవీంద్రనాథ్ ఇటీవల మరణించారు. అతని పేరుపై ఉన్న ఆస్తిని సోదరుడైన రామ్మోహన్ పేరు మీద దాన విక్రయం చేయడానికి కుటుంబ సభ్యులందరూ అంగీకరించారు. దాంతో దానవిక్రయం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు గత నెలలో డాక్యుమెంట్ రైటర్ చంద్రశేఖర రావును ఆశ్రయించారు.

ఆ రిజిస్ట్రేషన్ ను ఎస్ ఆర్ ఓ సత్యనారాయణమూర్తి పెండింగ్ లో పెట్టారు. స్థలం చూసిన తర్వాత ప్రక్రియ పూర్తి చేస్తామని ఎస్ ఆర్ ఓ చెప్పారు. ఆ స్థలాన్ని పరిశీలించిన ఆయన రిజిస్ట్రేషన్ కు రెండు లక్షలు లంచం ఇవ్వాలని మెలిక పెట్టారు. తాను అంత మొత్తం ఇవ్వలేనని చెప్పడంతో చివరకు లక్ష 30 వేలకు బేరం కుదిరింది. గురువారం ఉదయం రామ్మోహన్ ఎస్ ఆర్ ఓ ను కలిశారు.

ఒప్పందం కుదిరిన మొత్తం డాక్యుమెంట్ రైటర్ కు ఇచ్చి సాయంత్రం కలవాలని సూచించారు. అంతకుముందే బాధితుడు రామ్మోహన్ అవినీతి నిరోదక శాఖ అధికారులను సంప్రదించారు. ప్రణాళిక అమలు చేసేందుకు అతనికి పలు సూచనలు చేశారు. లక్ష ముప్పై వేలు తీసుకుని డాక్యుమెంట్ రైటర్ చంద్రశేఖర్ వద్దకు వెళ్లాడు. అతను తన అసిస్టెంట్ మురళీకృష్ణ కు ఆ మొత్తం ఇవ్వాలని సూచించారు. మురళీకృష్ణ. ఆ మొత్తాన్ని తీసుకుంటున్న సమయంలో ఎసిబి డిఎస్పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పట్టుకున్నారు.

నేరుగా అతన్ని తీసుకుని ఎస్ ఆర్ ఓ సత్యనారాయణమూర్తి వద్దకు తీసుకువచ్చారు. కొన్ని గంటలపాటు మూర్తిని విచారించారు. ఇతనితో పాటు డాక్యుమెంట్ రైటర్, అతని అసిస్టెంట్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఆ ముగ్గురిని కర్నూలు ఏసిబీ కోర్టులో హాజరు పరచనున్నారు.

కొందరు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అవినీతి దందాను సత్యనారాయణమూర్తి నడుపుతూ వచ్చినట్లు తేటతెల్లమైంది. మూడేళ్ల క్రితం అనంతపురం రూరల్ లో పనిచేస్తున్న సందర్భంలో కొద్దిలో తప్పించుకున్న సత్యనారాయణ మూర్తి ఎట్టకేలకు అనంతపురం అర్బన్ లో ఏసీబీ ఉచ్చుకు చిక్కక తప్పలేదు.

ఎలాంటి డాక్యుమెంట్ అయినా సరే ముడుపులు ఇవ్వనిదే ఆయన రిజిస్ట్రేషన్ చేయడు అన్నది జగమెరిగిన సత్యం. ఏ క్రయ,విక్రయిదారుడుని అడిగినా ఇదే చెబుతారు. ఇంత కాలానికి పాపం పండింది. అనంతపురం రూరల్ లో ఏసీబీ నుంచి తప్పించుకున్న తర్వాత ముడుపుల స్వీకరణకు వ్యూహం మార్చాడు. నేరుగా ముడుపుల మొత్తాన్ని స్వీకరించకుండా వివిధ రూపాల్లో వాటి వసూలుకు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఆ నేపథ్యంలోనే ఏసీబీ కి చిక్కాడు. చాలా కాలంగా అతనిపై ఏసీబీ నిఘా ఉంచింది. ఎక్కడా కూడా దొరక్కుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.తన కత్తికి ఎదురులేదని భావిస్తూ వచ్చిన సత్యనారాయణమూర్తికి ఊహించని విధంగా ఏసీబీ షాక్ ఇచ్చినట్లయింది. తన బంధువు పోలీసు శాఖలో పనిచేస్తున్నాడంటూ ఆయన ఫోటో చూపించి తన దందాను ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అంతేకాక తనను ఎవరు ఏమి చేయలేరన్న ధీమా ఆయనలో బలంగా నాటుకుపోయింది. బరితెగించి అక్రమార్జనకు పాల్పడితే ఆలస్యంగా నైనా ఇలాంటి మూల్యం చెల్లించుకోక తప్పదు.

Related posts

ప్రతి బస్తీలో పరిశుభ్రతను పాటించేలా తగిన చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

Satyam NEWS

అచ్చెంనాయుడిపై పోలీసు కేసు నమోదు

Satyam NEWS

Leave a Comment