28.7 C
Hyderabad
May 5, 2024 08: 37 AM
Slider గుంటూరు

ఆధార్ కోసం హెడ్ పోస్టాఫీస్ వద్ద జనం పడిగాపులు

aadhar centre

ఆధార్‌ కార్డులో మార్పులు, చేర్పులు, తప్పుల సవరణలు జరగక ఇబ్బంది పడుతున్నారా? ఇక ఆ అవసరం లేదు. సమీప హెడ్ పోస్టాఫీసు కు వెళ్తే సరిపోతుంది. 15 నిమిషాల్లో అప్‌డేషన్‌ ప్రక్రియ పూర్తి అవుతుంది. 24 గంటల తర్వాత యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో ఈ–ఆధార్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పక్షం రోజుల్లో ఇంటికి ఒరిజనల్‌ ఆధార్‌ పోస్టులో అందుతుంది. ఇవీ ప్రభుత్వం చెబుతోన్న మాటలు.

సిబ్బంది నిర్ల‌క్ష్య స‌మాధానాలు..

అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మంగళగిరి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులోని హెడ్ పోస్టాఫీస్ వద్ద ఆధార్ సవరణల కోసం జనం ఉదయం నుంచే పడిగాపులు కాస్తోన్నారు. తీరా… జనం క్యూలో నిల్చొన్న తరువాత… మధ్యాహ్నం రావాలని పోస్టాఫీస్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ వెనక్కు పంపుతున్నారు. కూలీ పనులు మానుకుని మరీ ఆధార్ మార్పుల కోసం వస్తే… ఇలా పదే పదే తిప్పుతూ ఇబ్బందులకు గురిచేయడం ఎంత మాత్రం సమంజసమని పలువురు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ఆధార్ సవరణలకు ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బ్యాంకుల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి జేసితో ఎమ్మెల్యే ఆర్కే

ఆధార్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేయించుకునేందుకు మంగళగిరి హెడ్ పోస్టాఫీస్ లోని ఆధార్ కేంద్రంలో ప్రజలు పడే ఇబ్బందులపై సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం కథ‌నం వచ్చింది. దీనికి స్పందించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) రైల్ వె స్టేషన్ రోడ్డులోని హెడ్ పోస్టాఫీస్ ను సందర్శించారు. క్యూ లైన్ లో పడిగాపులు కాస్తున్న వృద్ధుల్ని పలకరించారు. ఆధార్ నమోదు కోసం వచ్చే వారి ఇబ్బందులకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆధార్ కేంద్రాల కోరత వల్ల పోస్టాఫీస్ లోని కేంద్రానికి ప్రజల రద్దీ పెరిగిందని వారు ఆర్కే దృష్టికి తీసుకెళ్లారు. దీనితో ఎమ్మెల్యే జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేసి ప్రతీ బ్యాంకు లోనూ ఓ ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలో ఆధార్ కేంద్రాల సంఖ్యను పెంచి సమస్య పరిష్కరిస్తామని జేసీ హామీ ఇచ్చారు.

Related posts

హాట్సాఫ్: కరోనా గురించి రాహుల్ గాంధీ ఏనాడో చెప్పారు

Satyam NEWS

క‌రోనా నివార‌ణ‌కు న‌గ‌రంలో మేయ‌ర్,డిప్యూటీ మేయ‌ర్ ర్యాలీ….!

Satyam NEWS

భారత్ చేతిలో ఎనిమిది మంది పాకిస్తాన్ సైనికులు హతం

Satyam NEWS

Leave a Comment