41.2 C
Hyderabad
May 4, 2024 18: 28 PM
Slider ప్రత్యేకం

దాసుకి ఊస్టింగ్… ప్రసాదుకి పోస్టింగ్

త్వ‌ర‌లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మార్పులు….!


త్వ‌ర‌లో జరగనున్న ఏపీ రాష్ట్ర మంత్రివర్గ మార్పులు, చేర్పుల్లో సిక్కోలు జిల్లాకు సంబంధించి భారీ పరిణామమే చోటు చేసుకోబోతోంది.. వైఎస్ఆర్సీపీ లోని కొందరు పెద్దలు అందించిన విశ్వసనీయ సమాచారం మేరకుభారీమార్పులే చోటుచేసుకోబోతున్న‌ట్టు స‌మాచారం..ప్రస్తుత మంత్రి ధర్మాన కృష్ణ దాసుకి పదవీ గండం తప్పక పోవచ్చు… ఆయన స్థానే స్వయానా ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావుకి మంత్రి పదవి దక్కొచ్చు… ” కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలనే ” చందంగా దాసు మంత్రి పదవి కోల్పోయేందుకు కూడా అనేకానేక కారణాలున్నాయట…. రానున్న ఎన్నికల రణ రంగంలో పార్టీని విజయ పథంలో నడిపించే విషయంలో దాసు కంటే ప్రసాదే సమర్ధుడని పార్టీ పెద్దలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారని సమాచారం…. కనీసం సీదిరి అప్పలరాజు టైపులో అయినా దాసు పార్టీ పరంగా హైప్ క్రియేట్ చెయ్యలేకపోయారని పార్టీ వర్గాల్లో టాక్….ఇచ్ఛాపురం నుంచి సిక్కోలు వరకూ ఏదో ఒకటి చేసి గెలుపు గుర్రాలను పార్టీకి అందించ గలిగే చతురత ప్రసాదరావుకే ఉందనేది జగనెరిగిన సత్యమని , చివరి నిముషంలో ఏదో అద్భుతం జరిగితే తప్పించి ఇందులో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చనేది పార్టీ పెద్దల ఉవాచ….!!.

Related posts

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్ప‌ణ‌

Satyam NEWS

పైడిత‌ల్లి పండుగ: సిరిమాను తిరిగే ప్రాంతాల్లో సీసీ కెమారాలు ఏర్పాటు…!

Satyam NEWS

ట్రోల్స్: వెనుక నుండి పట్టవద్దు ముందు నుండి దొరకవద్దు

Satyam NEWS

Leave a Comment