27.7 C
Hyderabad
May 4, 2024 07: 26 AM
Slider విజయనగరం

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు

#VijayanagaramPolice

“ఆంధ్ర రాష్ట్ర అవతరణ కు అమరజీవి అయినావు..ఆంధ్రుల హృదయాలలో అజారమమై నిలిచావు”

విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల జయంతిని జిల్లా పోలీసు కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రాజకుమారి ముఖ్య అతిధిగా హాజరై, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములని అన్నారు.

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఎంతగానో కృషి చేసారన్నారు. మహాత్మా గాంధీ భోదించిన సత్యం, అహింసా, హరిజనోద్ధరణకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడన్నారు.

భార్య, బిడ్డ చనిపోవడంతో జీవిత సుఖాలపై విరక్తి చెంది, ఉద్యోగానికి రాజీనామా చేసి, గాంధీజీ మార్గదర్శకంలో పని చేసేందుకై సబర్మతి ఆశ్రమానికి చేరి, ఆశ్రమ బాధ్యతలు నిర్వహించి, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, పలుమార్లు జైలుకు వెళ్ళిన స్వాతంత్ర్య పోరాటం చేసిన గాంధేయ వాదన్నారు.

మద్రాసు రాజధానిగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో తమిళులు తెలుగు వారి బాధల పై ఉద్యమించి, భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని ఉద్యమించి, ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి, అమరుడయ్యారన్నారు. పొట్టి శ్రీరాములు మరణానంతరం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు.

అనంతరం, పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణ రావు, ఏఆర్ డీఎస్పీ ఎల్. శేషాద్రి, డీసీఆర్బీ సిఐ బి.వెంకటరావు, ఎస్బీ సీఐ రుద్రశేఖర్, ఆర్ఐ లు పి.నాగేశ్వరరావు, పి. ఈశ్వరరావు, రాజు, కుమార్, పోలీసు అసోసియేషన్ సభ్యులు కె.శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలను సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు.

Related posts

ముగ్గురు స్మ‌గ్ల‌ర్లు అరెస్ట్‌.. 10 ఎర్ర చంద‌నం దుంగ‌లు స్వాధీనం

Sub Editor

వాగులో పడి ముగ్గురు విద్యార్థుల మృతి

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: సినిమా షూటింగులు రద్దు చేద్దాం

Satyam NEWS

Leave a Comment