Slider తెలంగాణ

వాగులో పడి ముగ్గురు విద్యార్థుల మృతి

youth died

సిద్దిపేట జిల్లా కొహెడ మండలం వరికోలులో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వాగులో మునిగి మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరికోలు గ్రామానికి చెందిన కంటె నిఖిల్‌(19), కూన ప్రశాంత్‌(20), పి.వరప్రసాద్‌(18) మంగళవారం ఉదయం కార్తీక పౌర్ణమి కావడంతో స్నానం చేసుకునేందుకు గ్రామశివారులో ఉన్న మోయతుమ్మిదవాగులోకి దిగారు. ఈతకొట్టేందుకు ప్రయత్నించి వాగులోని ఓ గుంతలో చిక్కుకొని గల్లంతయ్యారు. దీనిని గుర్తించిన  అక్కడివారు.. గాలించి వారిని బయటకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే వారు మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.

Related posts

కొల్లాపూర్ లో గడిచిన ఐదేళ్లలో  అన్ని అరాచకాలే

Satyam NEWS

జర్నలిస్టు రవీందర్ రెడ్డిపై సైబర్ క్రైం పోలీసులకు బిజెపి ఫిర్యాదు

Satyam NEWS

ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

Satyam NEWS

Leave a Comment