27.7 C
Hyderabad
May 4, 2024 08: 36 AM
Slider ఆదిలాబాద్

ఆటకు పేదరికం అడ్డుకాకూడదు : ఒలింపిక్ అధ్యక్షులు బి.జి.ఆర్

#adilabad sports

పేదరికం అన్నది ఆటకు అడ్డు కాకూడదని,  ఒలంపిక్స్ లో మెడల్ సాధించిన క్రీడాకారుల్లో పేదరికం నుండే ఈ స్థాయికి ఎదిగిన వారున్నారని ఒలంపిక్ అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అండర్ 16 హాకీ టీం ఎంపిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. 

అనంతరం గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 40 ఏళ్ల తర్వాత ఒలంపిక్ లో భారత హాకీ టీం బ్రాస్ మెడల్ సాదించడం ఎంతో గర్వకారణమని అన్నారు.

ఇదే స్ఫూర్తితో జిల్లా హాకీ క్రీడాకారులు సైతం ఆటలో రాణించాలని ఆకాంక్షించారు.  ఆదిలాబాద్ జిల్లాలో హాకీ ఆటకి ఘన చరిత్ర ఉందని గుర్తు చేశారు. ప్రతి క్రీడాకారుడు నిత్య విద్యార్థిగా ఉంటూనే కొత్త విషయాలను తెలుసుకొని క్రీడల్లో రాణించాలని సూచించారు. 

ఇటీవల ఒలంపిక్ లో మెడల్ సాధించిన సలీమా ఇతర మహిళలు సైతం పేదరికం నుండి  వచ్చినవారేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, హాకీ కోచ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Related posts

భ్రూణ హత్యలు నేరం

Murali Krishna

ప్రాజెక్టు పెట్టు రుణాలు కొట్టు

Satyam NEWS

రెండు పత్రికల్ని, ఆ ముగ్గుర్ని ఉతికి ఆరేసిన జగన్

Satyam NEWS

Leave a Comment