41.2 C
Hyderabad
May 4, 2024 17: 55 PM
Slider

రేపటి నుండి శ్రీశైలంలో స్పర్శ దర్శనం ప్రారంభం…

#srisailam temple

కర్నూలు జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల 18 నుంచి భక్తుల సౌకర్యార్థమై దశల వారిగా స్వామివార్ల స్పర్శదర్శనం కల్పించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు స్వామివార్ల స్పర్శదర్శనం కల్పించేందుకు వీలు కల్పిస్తున్నారు.

గర్భాలయ అభిషేకాలు

కోవిడ్ నిబంధనలు దృష్టిలో ఉంచుకుని కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ అభిషేకాలు నిర్వహింపబడుతాయి.

ఇందులో భాగంగా రోజుకు 7 విడతలలో గర్భాలయ ఆర్జిత అభిషేకాలు నిర్వహించబడుతాయి. రోజుకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 6 విడతలలోనూ, సాయంకాలం ఒక విడతగాను ఈ గర్భాలయ అభిషేకాలు నిర్వహించబడుతాయి.

భక్తులు కరెంట్ బుకింగ్ ద్వారా ఈ అభిషేకసేవా టికెట్లను పొందవచ్చును.

సామూహిక అభిషేకాలు

ప్రతిరోజూ నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలను నిర్వహించడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా మరియు కరెంట్ బుకింగ్ ద్వారా కూడా ఈ టికెట్లను పొందే అవకాశం.

మొదటి విడత గం. 6.30లకు,

రెండవ విడత గం. 10.00 గంటలకు,

మూడవ విడత 12.30 గంటలకు,

నాల్గవ విడతలుగా సాయంత్రం 6.30 గంటలకు నిర్వహించబడుతాయి.

సామూహిక అభిషేక సేవాకర్తలకు అభిషేకానంతరం స్వామివారి స్పర్శదర్శనం కల్పించబడుతుంది.

Related posts

తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలి

Satyam NEWS

మూడో దశ అధ్యయనాల దశకు వచ్చిన నాసల్ కరోనా వ్యాక్సిన్

Satyam NEWS

రాజంపేట లో ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

Bhavani

Leave a Comment